06.05.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల, ఖమ్మం.
ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు గారి ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చిన బస్తర్ మహారాజు, కాకతీయ వంశ వారసుడు మహారాజా కమలచంద్ర భంజ్ దేవ్ కాకతీయ కు జిల్లా బీజేపీ నేతలు సోమవారం రాత్రి ఘన స్వాగతం పలికారు. ఒక ప్రైవేటు విడిదిలో బసచేసిన మహారాజు ను జిల్లా బీజేపీ అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ నేతృత్వంలోని నేతల బృందం మర్యాదపూర్వకంగా కలుసుకుని సత్కరించింది. బీజేపీ విజయం కోసం బిజీ షెడ్యూల్ లోనూ ఖమ్మం వచ్చినందుకు వారు కృతజ్ఞతలు తెలిపారు. తన ఆత్మీయ మిత్రుడు, సేవా తత్పరుడు అయిన వినోద్ రావు విజయం కోసం శ్రమిస్తున్నందుకు మహారాజు వారిని అభినందించారు.
మహారాజును సత్కరించిన వారిలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఉప్పల శారద, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యామ్ రాథోడ్, కిసాన్ మోర్చ జిల్లా అధ్యక్షులు చావా కిరణ్, అసెంబ్లీ కన్వీనర్ అల్లిక అంజయ్య, రాష్ట్ర మహిళా మోర్చ లీగల్ సెల్ కో కన్వీనర్ కొలిపాక శ్రీదేవి, ఖమ్మం పట్టణ మండల అధ్యక్షులు, కుమిలి శ్రీనివాస్, లక్ష్మీ నారాయణ గుప్త, BJYM జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదుల భద్రం, పట్టణ ప్రధాన కార్యదర్శులు దీకొండ శ్యామ్ సుందర్, అంకతి పాపారావు, శాసనాల సాయిరాం, బోయినపల్లి సురేష్. తదితరులు ఉన్నారు.















