హైదరాబాద్ సెప్టెంబర్ 21 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );: భర్త మరణాంతరం భార్య పిల్లులకు రావాల్సిన ప్రయోజనాలను దక్కనీయకుండా చేస్తున్న వ్యక్తులపై చట్టపరంగా ప్రభుత్వం చర్యలు తీసుకుని, బాధిత కానిస్టేబుల్ కుటుంబానికి న్యాయం చేయాలని తెలంగాణ స్టేట్ క్రిస్టియన్ అండ్ కన్వర్టెడ్ క్రిస్టియన్ యునైటెడ్ స్ట్రగుల్ కమిటీ అడ్వైజర్ రేణుకుంట్ల ఎల్లయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధితులతో కలసి ఆయన మాట్లాడుతూ పిల్లి కిషోర్ కుమార్ అనే హెడ్ కానిస్టేబుల్ లాలాగూడ పోలీస్ స్టేషన్లో పనిచేస్తుండగా కిడ్నీలు చెడిపోయి గత ఏడాది డిసెంబరు 5న మృతి చెందారని తెలిపారు. కాగా చట్ట ప్రకారం అతని భార్య టి.నయోమి ఎలియాద, కొడుకు, కుమార్తెలకు దక్కవలసిన ప్రయోజనాలను ఆమె మామ రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ పిల్లి రాఘవులు, అత్త పి.సువర్ణ, అడపడుచులు, వారి కుటుంబ సభ్యులు మొత్తం కలిసి రానీయకుండా అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. తనకు జరిగిన అన్యాయంపై పోలీస్ స్టేషన్, ఏసీపీ, డీసీపీ, రాష్ట్ర డీఐజీకి వినతి పత్రాలను సమర్పించడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీచే విచారణ జరిపించి తన కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ నాయకుడు డేవిడ్ కడారి, మహిళా నాయకురాలు సుహాసిని పాల్గొన్నారు
.















