EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

కులగణనకు కట్టుబడిన కాంగ్రెస్ పార్టీకి బీసీలు అండగా ఉంటాం          సీఎం రేవంత్ తో బీసీ సంఘాల బేటీ

హైదరాబాద్ మే 4 (ఈతరం భారతం న్యూ స్);దేశవ్యాప్తంగా సామాజిక, సమగ్ర కులగనణ చేసి బీసీ రిజర్వేషన్లను జనాభా దామాషా ప్రకారం పెంచుతామని కాంగ్రెస్ పార్టీ జాతీయ మేనిఫెస్టోలో పేర్కొన్న దాన్ని స్వాగతిస్తున్నామని,బీసీల డిమాండ్లను కాంగ్రెస్ పార్టీలో మేనిఫెస్టోలో చేర్చిన దర్మిలా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో బీసీలు అండగా ఉంటారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు.నేడు హైదరాబాదులోని రాష్ట్ర ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి, పిసిసి కార్వ్యనిహాక అధ్యక్షకులు మహేష్ కుమార్ గౌడ్ తో సిఎం నివాసంలో బీసీ సంఘాల నేతలు బేటీ అయ్యారుఈ సందర్భంగా మొదటగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బీసీ కులగరణ చేసి బీసీ రిజర్వేషన్లు పెంచుతామన్న హామీ మేరకు తాము కులగనాన చేపట్టడానికి రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేశామని కులగలను కోసం 150 కోట్లు బడ్జెట్ కూడా కేటాయించామని ఎన్నికల కోడ్ ముగియగానే కులగరణ చేపట్టి బీసీ కులాల లెక్కలు తీస్తామని ఆయన అన్నారు ఇదే సమయంలో దేశవ్యాప్తంగా ఇండియా కూటమి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో సమగ్ర సామాజిక. కులగణన చేపట్టి బీసీలకు రిజర్వేషన్లు పెంచడమే కాకుండా మహిళా బిల్లులో బీసీ మహిళకు సబ్ కోటా, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ తదితర బీసీ డిమాండ్లను నెరవేర్చడానికి రాహుల్ గాంధీ కంకణబద్ధులై ఉన్నారని దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కులగనలపై మొదట సంతకం చేస్తామనిరాహుల్ గాంధీ గారు స్పష్టమైన హామీ ఇచ్చినందున దేశంలోని, రాష్ట్రంలోని బీసీలంతా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలని రేవంత్ రెడ్డి బీసీ సంఘాల నేతలను కోరారు బీసీల ఆకాంక్షలను, బీసీల డిమాండ్లను దేశవ్యాప్తంగా పరిష్కరించి బీసీల రాజకీయ రిజర్వేషన్లు పెంచడానికి బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉండడాన్ని తాము స్వాగతిస్తున్నామని ఇలాంటి సమయంలో దేశవ్యాప్తంగా అలాగే తెలంగాణారాష్ట్రాంలోకూడా కాంగ్రెస్ పార్టీకి బీసీలంతా కఅండగా ఉంటారని జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు సీఎంను కలిసిన వారిలో బీసీ కుల సంఘాల జేఏసీ కో చైర్మన్ చిన్న శ్రీశైలం యాదవ్, బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్ ,బీసీ యువజన సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వక అధ్యక్షులు ఈడిగ శ్రీనివాస్, జాజుల భాస్కర్ తదితరులు ఉన్నారు

 

 

Related News

Select the Topic
Scroll to Top