EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

కుల గణన హర్షనీయం: తెలంగాణ వంజరి సేవా సంఘం

సికింద్రాబాద్ ఫిబ్రవరి 16 (ఈ బీ న్యూస్ );తెలంగాణ రాష్ట్రంలో కుల గణన చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టడం పట్ల తెలంగాణ వంజరి సేవా సంఘం హర్షం వ్యక్తం చేసింది. సికింద్రాబాద్ లో ఈరోజు సమావేశమైనా తెలంగాణ వంజర సేవా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ, ఎంతో కాలం ఎంతో కాలం నుండి అనేక బీసీ కులాలు చేసిన విజ్ఞప్తిని గత ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోలేదని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం బీసీల కుల గణన చేపట్టడానికి నిర్ణయం తీసుకోవడం హర్షనీయమని వారు పేర్కొన్నారు. బీసీ కుల గణన చేపట్టిన తర్వాత బీసీ సబ్ ప్లాన్ కు మార్గం సుగమాగం అవుతుందని వారు అన్నారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఎటువంటి ప్రభుత్వ పథకాలకు నోచుకోలేని వంజరి కులాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని,తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వంజరి కులస్తులకు ఒక ప్రత్యేక పథకం ప్రవేశపెట్టాలని వారు రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలభారత వంజరి సేవా సంఘం జాతీయ సేన ఉపాధ్యక్షులు సాల్వేర్ కృష్ణ, తెలంగాణ వంజరి సేవా సంఘం అధ్యక్షుడు ఎదుగని శంకర్ నారాయణ, ప్రధాన కార్యదర్శి దాత్రిక ధర్మరాజు ఉపాధ్యక్షులు ఎదుగని హరినాథ్, పోత్నాక్( పిట్టల )అంజయ్య కార్యదర్శులు ఎదుగని రామకృష్ణ, లండేరి శ్రీనివాస్ తదితరులు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతించారు

 

 

Related News

Select the Topic
Scroll to Top