EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

కేసీఆర్ ప్రభుత్వం వైఖరిని అవలంబిస్తున్న సీఎం రేవంత్ వ్యవహారం

 

 

 

 

హైదరాబాద్ జనవరి 13 (Eetaram bharatam news);సీఎం రేవంత్ వ్యవహారం, ప్రకటనలు, కనపడుతున్న దృశ్యాలూ గత కేసీఆర్ ప్రభుత్వం తీరులానే ఉందని భారతీయ జనతా పార్టీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు.శనివారం హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాళేశ్వరం రీడిజైన్ పేరుతో ప్రజాధనాన్ని దోచుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ మంత్రులు సైతం కొత్త డిజైన్ గురించి ఆలోచన చేస్తున్నట్లుగా వారి ఆలోచన కనపడుతోందన్న అనుమానం వ్యక్తం చేసారు.గతం లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్..శాసనసభలో స్వయంగా అంతకుముందు కాంగ్రెస్ పాలనలో జరిగిన అక్రమాలు, అవినీతి, అరాచకాలపై మాట్లాడారు.జలయజ్నం ధనయజ్నంగా మారింది.. దోచుకున్నవాళ్లను, దాచుకున్నవాళ్లను పైసాతో సహా కక్కిస్తామంటూ మాట్లాడారు.కాంగ్రెస్ పాలనలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో అక్రమాలు జరిగాయని, ఇండ్ల నిర్మాణం జరగకుండానే బిల్లులు చెల్లించారంటూ… ఈ విషయంలో అవకవతవకలపై పాల్పడిన వారిని ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమని, కేసులు పెట్టి జైలుకు పంపిస్తామంటూ కేసీఆర్ చెప్పారు.కాని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ దోషిని పట్టుకోలేదన్నారు. కాంగ్రెస్ పాలనలో జరిగిన కుంభకోణాల విషయంలో డబ్బులను రికవరీ చేయలేదు.ఇలాంటి ప్రకటనలో ప్రతిపక్ష నాయకులను భయపెట్టి బొటాబొటీ మెజారిటీతో ఉన్న కేసీఆర్ ప్రభుత్వాన్ని గట్టెక్కించుకోవడం కోసం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారు.ప్రభుత్వాన్ని సుస్థిరపర్చుకొని రాజకీయ పబ్బం గడుపుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వ తీరును ప్రజలు గమనించారు.నేటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కనపడుతున్న దృశ్యాలు కూడా గత కేసీఆర్ ప్రభుత్వ తరహాలోనే కనపడుతోందన్నారు.నెలరోజుల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరుసార్లు ఢిల్లీకి వెళ్లారు. రాష్ట్రాన్ని పరిపాలించమని ప్రజలు అధికారం అప్పజెప్పితే.. ఆరుసార్లు ఢిల్లీకి వెళ్లాడు.పాలన ఢిల్లీనుంచి కొనసాగిస్తున్నట్లా..? లేక అధిష్టానానికి కప్పం కట్టేందుకు పర్యటనలు కొనసాగిస్తున్నట్లా..? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ ఫాంహౌజ్ నుంచి పాలన సాగించారు. రేవంత్ రెడ్డి తరచూ ఢిల్లీ వెళ్తూ వారి డైరెక్షన్లో పాలన చేస్తున్నడు. బీఆర్ఎస్ తరహాలోనే పాలన కొనసాగిస్తున్నడు.ఆరు గ్యారంటీల అమలు కోసం తెలంగాణ ప్రజలను లైన్లలో రోజుల తరబడి నిలబెట్టారు.కాంట్రాక్టర్లను, ఏజెంట్లను, సప్లయర్లను లైన్ లోకి తెచ్చుకున్న మంత్రులు మరోవైపు కనపడుతున్నరు.కొత్తగా రేషన్ కార్డులను ప్రజలు కోరుకుంటుంటే.. ఉన్న రేషన్ కార్డులు ఎలా తీసివేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదన్నారు.అర్హులైన వారి రేషన్ కార్డు ఒక్కటి తీసివేసినా భారతీయ జనతా పార్టీ ప్రజల తరఫున ఉద్యమిస్తుంది.రాష్ట్రంలోని 12769 గ్రామాలు, 10,434 రెవెన్యూ గ్రామాలకు గాను… కేవలం నడుస్తున్న బస్సులు 9232 మాత్రమే.రాష్ట్రంలో సగభాగం ఉన్న మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని కాంగ్రెస్ నాయకులు గొప్పలు చెప్పారు.నెలరోజులుగా ఉచిత బస్సు ప్రయాణం గురించి వివరాలు సేకరించాం.సరిపడాబస్సులు లేక, బస్సులు రాక ఉచితంగా ప్రయాణించే మహిళల పాట్లు దారుణంగా ఉన్నాయన్నారు. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు చెందిన లక్షలాది మంది విద్యార్థినులు ప్రైవేటు వాహనాల్లో ప్రయాణం కొనసాగిస్తున్నరు. మరి వీరికి ఉచిత ప్రయాణం ఎలా అమలు చేస్తారు..? ప్రణాళికబద్దంగా అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వ తీరు చూస్తుంటే కేవలం పార్లమెంటు ఎన్నికల వరకే ఈ పథకం అమలు చేసే ధోరణియే అనిపిస్తోందన్న అనుమానం వ్యక్తం చేసారు.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గురించి సమగ్ర ప్రణాళిక లేకుండానే కేవలం అట్టహాసంగా ప్రకటనలు చేయడం… ఓట్ల కోసం పబ్బం గడుపుకోవడమే.కాంగ్రెస్ ఆరు గ్యారంటీల విషయంలో కపట నాటకం ఆడుతోందని,. మొదటి మాసంలో రూ. 15 వేల కోట్ల అప్పుకోసం రేవంత్ ప్రభుత్వం ప్రాకులాడింది. బీఆర్ఎస్ ప్రభుత్వ పంథాలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పాలన నడిపిస్తోంది.బీఆర్ఎస్ కు బీ టీం కాదు.. అని చెబుతుంటే వారి ఆంతర్యం.. కాంగ్రెస్ కు సహకరిస్తున్న సీ టీమ్ అనే అనిపిస్తోంది.రాష్ట్రంలో రేషన్ కార్డులు తీసివేసే చర్యలకు పూనుకుంటే.. భారతీయ జనతా పార్టీ ఆధర్యంలో ప్రజా ఉద్యమం తప్పదని ప్రబాకర్ హెచ్చరించారు

.

 

Related News

Select the Topic
Scroll to Top