4.4.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల, ఖమ్మం.
కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి గురువారం కొణిజర్ల, కల్లూరు మండలాల్లో పర్యటించారు. తనికెళ్ళలో తుప్పతి సత్యనారాయణ కుమారుడి , అమ్మపాలెం లో కిలారు మాధవరావు, పెద్ద మునగాల లో రామ లక్ష్మణ కుమారుడి వివాహ వేడుకలకు హాజరై..దీవించారు. అమ్మపాలెం లో గరిబ్ పాష నివాసానికి వెళ్లి..తేనీరు స్వీకరించారు. రంజాన్ ఉపవాస వివరాలు తెలుసుకున్నారు. కల్లూరు మండలం చండ్రుపట్ల , రాళ్ల బంజర గ్రామాల్లో కొత్త జంటలను ఆశీర్వదించారు. నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని ఆశీర్వదించారు. అనంతరం ప్రసాద్ రెడ్డి స్వగ్రామం నారాయణ పురం లో భీమిరెడ్డి సత్యనారాయణ రెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరై దీవించారు. తమ నివాసానికి వెళ్లి..స్తానికులతో ముచ్చటించి..యోగ క్షేమాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పొంగులేటి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.















