EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

కొత్తగూడెం క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ముఖ్య కార్యకర్తల సమావేశం

 

రీజినల్ నెట్వర్క్ ఇంఛార్జి మధు శ్రీ  నలుబోల, ఖమ్మం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

కొత్తగూడెం క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సంధర్భంగా మంత్రి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలకు 29 రోజులు టైం ఉంది.రాబోయే రెండు రోజుల్లో అభ్యర్థిని ప్రకటించే అవకాశం.అభ్యర్థి ఎవరైనా పార్టీకి కట్టుబడి ఉండాలి, గెలిపించాలంటూ కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు.ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. రాహుల్ గాంధీ కి రెండు పర్యాయాలు ప్రధానమంత్రి అవకాశం వచ్చిన దేశం బాగు కోరి తృణప్రాయంగా వదిలిపెట్టారుఅని చెప్పారు.ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థికి అత్యధిక మెజారిటీ వచ్చేలా చేయాలని కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కోరుతున్నాను.కొత్తగూడెం నియోజకవర్గ ఆడబిడ్డలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మంచి మెజారిటీ తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.పొత్తులో భాగంగా కొత్తగూడెం ఎమ్మెల్యేగా సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావును కష్టపడి 26 వేల మెజారిటీ తో గెలిపించుకోవడం జరిగిందనీ,110 రోజుల్లోనే 5 గ్యారంటీలను అమలు చేసాము అని తెలిపారు.కేసీఆర్ కుళ్ళు కుతంత్రాలతో గత ప్రభుత్వం టిఆర్ఎస్ పెద్దల కారణంగా 46,000 వేల కోట్ల మిషన్ భగీరథ పేరుతో కొల్లగొట్టారు,తెలంగాణ ప్రజలకు బుక్కెడు మంచినీటిని ఇవ్వలేదు,ఇంటింటికి తాగునీరు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది అని చెప్పారు రైతుల పట్ల గత ప్రభుత్వం వారు చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పై లేని పోని విమర్శలు చేస్తుందన్నారు

Related News

Select the Topic
Scroll to Top