దసరా, బతుకమ్మ పండుగ సంబరాల్లో తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానెల్, జెమినీ టీవీ, సీరియల్ నటులు… తమ అభిమాన ప్రేక్షకులతో కలిసి నగరంలోని వివిధ ప్రాతాలలో దుర్గా పూజా మండపాల వద్దకు సందడి చేశారు. ఆదివారం కొత్తపేట లో జెమినీ టీవీ యొక్క ప్రముఖ షో ” కొత్తగా రెక్కలొచ్చేనా సీరియల్ నటులు హైదరాబాద్ కొత్తపేట్ లో తమ అభిమానులతో సంతోషంగా గడపటం తో పాటుగా చిరస్మరణీయ క్షణాలను సృష్టించారు.ప్రకాశవంతంగా వెలిగిపోతున్న దుర్గా పూజా మండపాల వద్ద బతుకమ్మ ఆడుతూ, పాటలు పాడుతూ, డ్యాన్స్ చేస్తూ, సెల్ఫీలు తీసుకుంటూ, బహుమతులను అందిస్తూ , సమిష్టి స్ఫూర్తిని చాటుతూ కళాకారులు తమ అభిమానులతో ఆనందోత్సాహాలతో గడిపారు.తమ వీక్షకులతో దృఢమైన బంధాన్ని పెంపొందించుకోవడానికి మరియు ప్రతి పండుగను సంతోషకరమైన అనుభూతిగా మార్చడానికి జెమినీ టీవీ కట్టుబడి ఉంది. దసరా, బతుకమ్మ వేడుకల సందర్భంగా తమ కళాకారులను ప్రేక్షకులకు మరింత చేరువ చేసేందుకు ఛానెల్ చేస్తున్న ప్రయత్నం ఐక్యత మరియు వేడుకల యొక్క సంతోషకరమైన క్షణాలను ఆనందం గా గడిపారు.
















