జనవరి 25, యాదాద్రి భువనగిరి(EB news) యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో శ్రీ మార్కండేయ పద్మశాలి సంఘం కొలనుపాక సంఘం అధ్యక్షులుగా నోముల వాసుదేవ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు .సభ్యులు శాలువాతో సన్మానించి స్వీట్ లను పంపిణీ చేశారు. అనంతరం ఎన్నికైన అధ్యక్షులు వాసుదేవ్ మాట్లాడుతూ పద్మశాలి సంఘం కోసం అహర్నిశలు శ్రమించి సంఘాన్ని అభివృద్ధి పథంలో నడుపుతాననీ, ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను ఎమ్మెల్యే చొరవ తో ఎక్కువ నిధులు తీసుకొచ్చి పద్మశాలి సంఘానికి సమకూరుస్తానని ఆయన మీడియా తో తెలిపారు. ఈ కార్యక్రమంలో అంకం. మల్లేశం, రాజయ్య, సురేష్, రాజు, మల్లేషం, యాదగిరి, హన్మంత్, పుండరికం, క్పష్ణ, సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.















