హైదరాబాద్ ఫిబ్రవరి 14 (ఈ బీ న్యూ స్);ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి సుల్తాన్ బజార్ కోటి ఆసుపత్రి సూపర్డెంట్ డా. రాజ్యలక్ష్మి చేస్తున్న అధికార దుర్వినియోగం ఆగడాలు సిబ్బంది వేధింపులపై సమగ్ర విచారణ జరిపించాలని గోల్నాక డివిజన్ కమ్యూనిస్టు పార్టీ అధ్యక్షుడు సయ్యద్ జోహరుద్దీన్ డిమాండ్ చేశారు. తన కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్ నిరాహార దీక్ష చేస్తూ నిమ్స్ లో అడ్మిట్ అయినప్పుడు డ్యూటీలో ఉన్న డాక్టర్ రాజలక్ష్మి కెసిఆర్ కు సపోర్ట్ చేస్తూ అతనిని దొంగ చాటుగా తన ఆబ్రాన్ కోర్టు జేబులో తీసుకొచ్చిన ఆహార పానీయాలు సిసి కెమెరాకు అడ్డువ నిలబడి సర్వే చేస్తూ కేసీఆర్ వారి కుటుంబ సభ్యులను మంచిగా చేసుకొని ఆ సమయంలో కేసీఆర్ తో దిగిన ఫోటో తన వద్ద పెట్టుకొని అదే ఫోటో ప్రగతిభవన్లో ఉన్నదని చెప్పి దానిని ఆసరాగా చూపి అవినీతికి పాల్పడుతూ సిబ్బందిని బెదిరిస్తూ నాన్న దుర్బచర్ల ఆడుతూ గత ప్రభుత్వ సపోర్టుతో అనేక రకాలుగా ఇష్టానుసారం అక్రమాలకు పల్పడుతున్నాటు ఆరోపించారు.ఆస్పత్రిలో అవినీతి తారస్థాయిలో పెరిగి పర్మినెంట్ ఉద్యోగులను అణచివేస్తూ ప్రైవేటు ఉద్యోగులతో లంచాలు తీసుకుంటున్నారని ఆసుపత్రి సూపర్డెంట్ ఒక నియంతగా ప్రవర్తిస్తుందని ప్రధానంగా లేబర్ రూమ్ ఆపరేషన్ థియేటర్ వద్ద డెలివరీ అయిన పేషెంట్ దగ్గర మగ పిల్లవాడు పుడితే 3000 ఆడపిల్ల పుడితే 2000 కాగా ఓపి రిజిస్ట్రేషన్ వద్ద ఒక చీటీ కొరకు 50 నుండి 100 రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి రోగులు ఆస్పత్రి లోపలికి వెళ్లాలంటే సిగరెట్ గాడుతో నానా ఆవశలు పడుతున్నారని లోపలికి వెళ్లాలంటే 50 నుంచి వంద రూపాయలు సమర్పించాల్సిందే ఈ ఆస్పత్రిలో జరిగే ప్రతి సేవకు ఒక ధరలను ఫిక్స్ చేసి వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి దీని కొరకు ప్రత్యేకంగా ఆ సూపర్డెంట్ ఇద్దరు సూపర్వైజర్లను నియమించుకున్నట్లు పేర్కొన్నారు. ఇద్దరు అవుట్సోర్సింగ్ సెక్యూరిటీ సిబ్బందిని మధ్య మధ్యలో ఉద్యోగం నుంచి తీసివేస్తూ డ్యూటీలో చేర్చుకోవడానికి పది నుండి 20వేల రూపాయలు వసూలు చేస్తున్నట్లు ఆయన ఆరోపించారు.
గత ప్రభుత్వంలో ఈమె ఆడింది ఆట పాడింది పాట..
గతంలో జరిగిన ఫార్మసీ ఆక్రమణలపై విజిలెన్స్ వాళ్ళు ఎంక్వయిరీ జరిపిన ఇప్పటివరకు ఎవరి మీద చర్యలు తీసుకోలేదు, ఒక పురాతన ఆసుపత్రిని కూలగొట్టి దాని స్థానంలో కొత్త ఆసుపత్రిని నియమించారు. కొలగొట్టిన పాత సామాన్లు పాత ఫర్నిచర్సులు కం ప్యూటర్స్ సిస్టములు తరలించినట్లు తెలిసింది.కావున నేను ఈ ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ రాజ్యలక్ష్మి పై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది దీనిపై తక్షణమే దీనిపై ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని నిజ నిర్ధారణ కమిటీ వేయాలని డిమాండ్ చేసారు
.















