కోరుట్ల డిసెంబర్ 14 (ఈతరం ఇండియా న్యూ స్);కోరుట్ల నియోజకవర్గం కోరుట్ల మండలంసంగెమ్ గ్రామంలో ఈరోజు వంజరి సంఘ నూతన భవన కార్యాలయం ప్రారంభమైంది. ఎంతో కాలం నుంచి క్రియాశీలకంగా పనిచేస్తున్న సంఘం గ్రామ వంజరి సంఘం కార్యవర్గం తమకంటూ ఒక ప్రత్యేకమైన కార్యాలయ భవనం ఉండాలన్న ఉద్దేశంతో పనులు ప్రారంభించి ఈరోజు ప్రారంభవేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా తెలంగాణ వంజరి సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్లె శంకర్ ముష్కరి తుకారాం స్థానిక నాయకులు సిటీ వెంకట్రావు స్థానిక సర్పంచ్ చెప్పాల నర్సయ్య మాజీ ఎంపీటీసీ సభ్యులు నల్లా వెంకటేశ్వర్లు, దోనే రాజు లు హాజరైనారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు తుదుగని గోపి సంఘ కార్యవర్గం కీర్తి నారాయణ ధోనేరాజ్ కుమార్ ధోనేసత్యనారాయణ, ఆరే రాజ్ కుమార్, తుదుగానిరమేష్ లవంగ నరసయ్య, కీర్తి రాజశేఖర్ దొనే శ్రీనివాస్ తదితరులు హాజరైనారు
















