EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

క్రోధి నామ సంవత్సరంలో అంతా మంచి జరగాలి.. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి శీనన్న చేతుల మీదుగా ధూప దీప నివేదన అర్చక సంఘ పంచాంగం ఆవిష్కరణ  అర్చకుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ

 

ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల, ఖమ్మం.

తెలుగువారి కొత్త ఏడాది అయిన శ్రీ క్రోధి నామ సంవత్సరంలో అంతా మంచి జరగాలని, రాష్ట్రంతో పాటు దేశం మంచి దిశగా పయనించాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఖమ్మంలోని ఎస్సార్ కన్వెన్షన్ లో జిల్లా ధూప, దీప నివేదన అర్చక సంఘం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీ క్రోధి నామ సంవత్సర నూతన పంచాంగాన్ని ఆవిష్కరించారు. అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. శ్రీ క్రోధి ఏడాది రౌద్రావతారంలో ఉంటుందని పండితులు చెబుతున్నారని.. చల్లగా సాగాలని, అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నానని అన్నారు.

సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తా..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దృష్టికి తీసుకెళ్లి.. హైదరాబాదులో అర్చకులతో సమావేశం నిర్వహించి ప్రధాన సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. భగవంతుడికి, భక్తుడికి అనుసంధానకర్తగా ఉండే అర్చకులకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటామని అభయం ఇచ్చారు. అందరూ ఉగాది పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అర్చకులు మంత్రి పొంగులేటిని సత్కరించారు.

ఈ కార్యక్రమంలో.. వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్, గిడ్డంగుల సంస్థ కార్పోరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, కాంగ్రెస్ నేత బొర్రా రాజశేఖర్, ధూప, దీప నివేదన అర్చక సంఘం జిల్లా అధ్యక్షులు మునగలేటి రమేష్ శర్మ, కార్యదర్శి అన్నావజ్జుల ప్రసాద శర్మ, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నం బొట్ల ఫణి కుమార శర్మ, కురుమేటి రామకృష్ణ శాస్త్రి, ఇంగువ సంగమేశ్వర శర్మ, నందుల ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top