హైదరాబాద్, మే 5 (ఈతరం భారతం న్యూ స్); వడ్రంగి వృత్తిలో ఉన్నబొల్లోజు జనార్ధన్ చారి(50) కొద్ది రోజుల క్రింద పని పూర్తి చేసుకొని హయత్ నగర్ లో తన ఇంటికి తిరిగి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఛాతీకి, మొఖం మీద అనేక తీవ్రమైన గాయాలు అయ్యాయి. అపస్మారక స్థితిలో దగ్గరలోనే ఉన్న ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చేర్చబడి, అక్కడేచికిత్స పొందుతున్నారు.అతని భార్య, కూతురు, ఇద్దరు కుమారుల భవిష్యత్తుఅతనిపై ఆధార పడి ఉంది! ఇప్పటి వరకు అతని చికిత్సకు 3.5 లక్షల రూపాయల ఖర్చు అయింది. మిగిలిన చికిత్సకు ఇంకా 1.50 లక్షల రూపాయల ఖర్చు అవుతుందని, ఆయన సోదరుడు, స్థానిక నాయకుడు వెలుకుర్తి చంద్రశేఖర్ ద్వారా సహాయం కోసం వెస్సోని ఆశ్రయించారు. వెస్సో గౌరవ దాతల సహకారంతో జనార్థన చారికి రూ.52,700/- అందచేసింది. ఈ సందర్భంగా వెస్సో ట్రస్ట్ అధ్యక్షులు బంగారు తాతారావు మాట్లాడుతూ వైద్య ఖర్చులు భరించలేక, ఆర్థిక ఇబ్బందులు పడుతున్న జనార్ధన్ చారికి సమయానికి సహాయం చేసి ఆదుకొన్న గౌరవ దాతలకు హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు.















