నిర్మల్ ఫిబ్రవరి 5 (ఈ బీ న్యూ స్): జిల్లాలోని ఖానాపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ ఖాతాలో చేరింది. బీఆర్ఎస్ చైర్మన్ రాజేందర్‌పై కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో ఖానాపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ వశం అయింది. ఖానాపూర్ మున్సిపాలిటీలో నేడు ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి చైర్మన్, వైస్ చైర్మన్లపై బల నిరూపణ పరీక్ష నిర్వహించారు. ఆర్డీవో రత్నకుమారి ఆధ్వర్యంలో ఈ బలనిరూపణ పరీక్ష జరిగింది. ఈ బలనిరూపణ పరీక్షలో మొత్తం 12 మంది కౌన్సిలర్లలో బీఆర్ఎస్ చైర్మన్‌కు వ్యతిరేకంగా 9 మంది కౌన్సిలర్లు ఓటేశారు. బీఆర్ఎస్కు చెందిన చైర్మన్ రాజేందర్, వైస్ చైర్మన్ ఖలీల్‌కు వ్యతిరేకంగా 9 మంది బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్లు ఒకటయ్యారు. దీంతో ఖానాపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ వశమైంది.















