హైదరాబాద్ ఫిబ్రవరి 12 (ఈ బీ న్యూ స్);హెల్ టాటామని చారిటబుల్ ట్రస్ట్ ఆద్వర్యం లో సోమవారం సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రి ఆవరణలో పేదలు, రోగి సహాయకులకు అన్న దాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్బంగా హెల్ టాటామని చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్తాపక అధ్యక్షురాలు కాకుమాను జ్యోతి మాట్లాడుతూ అన్నిదానములకన్న అన్నదానం గొప్పని, ఆకలితో అలమటించే వారికి పట్టెడన్నం పెట్టి వారి ఆకలి తీర్చడం లో ఉన్న తృప్తి మరెందులో ఉండదన్నారు.ఈ సందర్బంగా సుమారు 250 మంది పేదలకు అన్నదానాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమం లో హెల్ టాటామని చారిటబుల్ ట్రస్ట్ సబ్యులు పాల్గొన్నారు
.















