EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

గాంధీ ఆసుపత్రి లో ఆమరణ దీక్షలపై ప్రభుత్వం స్పందించాలి

గాంధీ ఆసుపత్రి లో ఆమరణ దీక్షలపై ప్రభుత్వం స్పందించాలి

కులగణనతో బాటు స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వర్తింపజేయాలి

 బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేశ్ డిమాండ్

హైదరాబాద్ సెప్టెంబర్ 2 (ఈతరం భారతం); కామారెడ్డి  బీసీ డిక్లరేషన్ అమలుకై గాంధీ ఆసుపత్రిలో కొనసాగుతున్న బీసీ నాయకులు బత్తుల సిద్దేశ్వర్ , జక్కని సంజయ్ ల ఆమరణ దీక్షకు బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేశ్ మరియు ముఖ్య కార్యవర్గం తమ సంఘీభావాన్ని తెలియజేసింది.. హాస్పిటల్ కు చేరుకున్న దాసు సురేశ్ దీక్ష చేస్తున్న నాయకుల ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను వాకబు చేసారు.. ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య స్థితిగతులను పరిశీలించాల్సిందిగా సిబ్బందికి విజ్ఞప్తి చేసారు .. తదనంతరం దాసు సురేశ్ మీడియాతో మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్ అమలుకై బీసీ నాయకులు చేస్తున్న పోరాటం న్యాయమైనదన్నారు..ప్రభుత్వం సత్వరమే సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేసారు .. కులగణనపై దేశవ్యాప్తంగా పెద్దఎత్తున్న చర్చ కొనసాగుతున్నదని ప్రజలంతా ఇందుకు మద్దతు తెలుపుతున్నారని దాసు సురేశ్ వివరించారు..కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా నష్టం వాటిల్లినా కులగణన విషయంలో వెనక్కు తగ్గేది లేదని కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టపరచడం , దేశంలోని అట్టడుగు వర్గాలకు కొండంత అండగా మారిందని దాసు సురేశ్ తెలిపారు. కులగణన అంశంపై రాహుల్ గాంధీ 6 నెలల క్రితం చేపట్టిన ఆన్లైన్ సర్వేలో కేవలం 59% ప్రజల మద్దతు లభించగా నేడు 74% గా ఇండియాటుడే నిర్వహించిన C-VOTER సర్వేలో స్పష్టం అయ్యిందని దాసు సురేశ్ తెలిపారు.ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలైన లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షులు చిరాగ్ పాశ్వాన్ ,జేడీయూ అద్యక్షులు నితీష్ కుమార్ సైతం పార్లమెంటరీ కమిటీ సమావేశంలో కులగణన కై పట్టుపట్టడాన్ని చూస్తే మారుతున్న రాజకీయ పరిణామాలు, ప్రజల ఆకాంక్షలు స్పష్టంగా విదితం అవుతున్నాయని తెలిపారు. దేశ వ్యాప్తంగా నిర్వహించే జనగణనలో అట్టడుగు వర్గాలు (BC, SC, ST) వారికి కులగణన నిర్వహించడం ద్వారానే శాస్త్రీయత,సాంకేతికతతో కూడిన సమాచారం లభ్యం అవుతుందనీ తద్వారా ఈ సమాచారాన్ని కోర్టులు సైతం తప్పక ఆమోదించవలసి వస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం మరింత జాప్యం చేయకుండా దేశ వ్యాప్తంగా కులగణన ను వెంటనే నిర్వహించి తమకు జరగబోయే రాజకీయ నష్ట నివారణను నిలువరించాలని హితవు పలికారు. రేవంత్ రెడ్డి హయాంలోని కాంగ్రెస్ పార్టీ సైతం కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో వెల్లడించిన విధంగా వెంటనే తెలంగాణ రాష్ట్రంలో కులగణన నిర్వహించి అందుకు అనుకూలంగా స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ లను 42% తగ్గకుండా నోటిఫికేషన్ జరిచేయాలన్నారు. గాంధీ హాస్పటల్ లో బీసీ నాయకుల ఆమరణ నిరహారణ దీక్షను ప్రభుత్వం సానుకూలమైన హామీ ఇచ్చి ఆమరణ దీక్షను వెంటనే విరమింపజేయాలని కోరారు .ఈ కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార సమితి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు బండారి పద్మ, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి తిప్పని నాగమణి, బీసీ రాజ్యాధికార సమితి యువజన ప్రధాన కార్యదర్శి వరిపల్లి అనిల్ కుమార్, కార్యదర్శి జనుకుంట్ల సాయి కుమార్, తెలుగురాష్ట్రాల కో ఆర్డినేటర్ పుట్టు వెంకటరమణ, సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు చామకూరి రాజు, ప్రధాన కార్యదర్శి కె. వి.గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

.

 

Related News

Select the Topic
Scroll to Top