EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

గులాబీ జెండాలతో రెపరెప లాడిన కాలేరు ఎన్నికల ప్రచార పాదయాత్ర

ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అధ్యక్షతన, మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిధి గా బాగ్ అంబర్ పేట లోని గజానంద్ గడ్డ లో ప్రారంభం అయి పాముల బస్తి, పొచమ్మ బస్తి, కుర్మ బస్తి మీదుగా గంగ బౌలీ వరకు జరిగిన ఎన్నికల ప్రచార యాత్రకొనసాగింది. మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్,ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మాట్లాదుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో చేసిన సంక్షేమం మరియు అభివృద్ధిని వివరించి, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఘనమైన మెజారిటీ అందించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు, నియోజక వర్గ పరిశీలకులు గండ్ర మోహన్ రెడ్డి, కార్పొరేటర్ పద్మా వెంకట్ రెడ్డి, డివిజన్ ప్రెసిడెంట్ చంద్ర మోహన్, సీనియర్ నాయకురాలు రెడ్డి పద్మావతి పార్టీ నాయకులు, మహిళా నేతలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top