30-03-2024 రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ నలుబోల మధులత ఖమ్మం.
భారతీయ జనతా పార్టీ ఖమ్మం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఖమ్మం అసెంబ్లీ విస్తృత స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో బీజేపీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు . కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో పార్టీ కార్యాచరణ గురించి చర్చించారు. సలహాలు, సూచనలను కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి కార్యకర్త బాధ్యతగా గెలుపే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. ఖమ్మం పార్లమెంట్ స్థానం నుండి మనం గెలిస్తే కేంద్రం నుండి అధిక నిధులు తెచ్చుకొని ఖమ్మం పార్లమెంట్ నియోజక వర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా , అధ్యక్షులు గల్లా సత్యనారాయణ గారు ,పార్లమెంట్ ప్రభారీ శ్రీకాంత్ గారు , బీజేపీ రాష్ట్ర నాయకులు సాగర్,జిల్లా జనరల్ సెక్రటరీ శ్యామ్ రాథోడ్,ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వర రావు , ఉపాధ్యక్షురాలు మంద సరస్వతి,జిల్లా ఉపాధ్యక్షులు బోయినపల్లి చంద్ర శేఖర్, దుడ్డుకూరి వెంకటేశ్వర్లు, జిల్లా కోశాధికారి రవీంద్ర,అసెంబ్లీ కన్వీనర్ అల్లిక అంజయ్య,మహిళా మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పమ్మి అనిత,బీజేపీ సీనియర్ నాయకులుసుబ్రహ్మణ్యం,బీజేవైఎం జిల్లా అధ్యక్షులు అనంత ఉపేందర్ గౌడ్, టౌన్ అధ్యక్షులుపిల్లలమర్రి వెంకట్ , తాజునోత్ భద్రం నాయక్ , కుమిలి శ్రీనివాస్ పొట్లపల్లి నాగేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.















