EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగురవేయాలి

గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగురవేసేందుకు అమరసింగ్ ను కార్వాన్ బీజేపీ ఎమ్మెల్యేగా గెలిపించాలని కార్వాన్ ఓటర్లకు రాజ్యసభ సభ్యులు, గోవా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సదానంర్పేట్ తానా వడే పిలుపునిచ్చారు. దేశానికి, సమాజానికి శ్రీరామరక్ష భాజపా పార్టీ ఒక్కటేనని, అలాంటి డబుల్ ఇంజన్ సర్కారు తెలంగాణకు అత్యవసరమని గోవా రాష్ట్ర భాజపా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు సదానందెట్ తానా వడే అన్నారు. అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన కార్వాన్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి టి అమర్ సింగ్ సోమవారం జియాగూడలో తన ఇంటింటి ప్రచార పాదయాత్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సదానంటేట్ తానావలే ముఖ్యఅతిథిగా విచ్చేసి అమరసింగ్కు మద్దతుగా ఆయనతో కలిసి జియాగూడలో ఇంటింటి ప్రచార పాదయాత్ర నిర్వహించారు. దోర ్బస్తీలోని మగ్గిమాత దేవాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం అమర్ సింగ్ పాదయాత్ర చేస్తూ ఇంటింటికీ వెళ్లి కమలం పువ్వు గుర్తుకే ఓటువేసి కార్వాన్ ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని ఓటర్లను అమర్సింగ్ కోరారు. ఈ సందర్భంగా సదానందే షేట్ తానా వడే మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ పార్టీని బలపర్చి, అవినీతి భారాస పార్టీ ప్రభుత్వాన్ని మట్టి కరిపించేందుకు ప్రతీ ఒక్కరూ తమ ఓటు ఆయుధంగా మలచుకుని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. కార్వాన్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి టి అమర్సింగ్ మాట్లాడుతూ ఎమ్మెల్యేగా తనకు ఒక్క అవకాశం కల్పిస్తే కార్వాన్లో బీజేపీ పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చి, గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగురవేసి తమ సత్తా ఏమిటో నిరూపిస్తానని దీమా వ్యక్తం చేశారు. అమర్ సింగ్ ప్రచార పాదయాత్ర డోర ్బస్తీ, ఇమాంపురా, సంజయ్ నగర్, బల్దియా కాలనీ, కేశవస్వామినగర్ తదితర ప్రాంతాలలో కొనసాగించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్వాన్ నియోజకవర్గ కన్వీనర్ గోవర్ధన్, సీనియర్ నేతలు దర్పల్లి నర్సింహులు, సతీష్ బిడ్డా, జియాగూడ డివిజన్ భాజపా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, రమేష్ చౌగ్గే, సత్యనారాయణ, వెంకటేశ్యదవ్, పార్టీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

Related News

Select the Topic
Scroll to Top