EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

గ్యాస్ ఈ కేవైసి తో సేవల్లో పారదర్శకత పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాశిల్దార్ రఘునందన్

 

కందుకూరు డిసెంబర్ 14 (ఈతరం ఇండియా న్యూ స్);వంట గ్యాస్ వినియోగదారుల ఈ కేవైసి నమోదు తో పారాదర్శకతతో పాటు సేవల్లో నాణ్యత పెరుగుతుందని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాసిల్దార్ మాచన రఘునందన్స్పష్టం చేశారు.గురువారం నాడు ఆయన కందుకూరు లో మీడియాతో మాట్లాడుతూ మాట్లాడుతూ..ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఉన్న వాళ్లు ఈ నెల ఆఖరు లోపు ఈ కేవైసి పూర్తి చేసుకోవచ్చని తెలిపారు. గ్యాస్ వినియోగదారులు కొందరు, ఈ కేవైసి నమోదు పట్ల అయోమయం నెలకొంది,స్పష్టత ఇవ్వండి అని అడుగుతున్న నేపథ్యం లో రఘు నందన్ స్పందిస్తూ..సాధారణ గ్యాస్ వినియోగదారుల కు ఈ కే వై సి అవకాశం 2024 మార్చి వరకు ఉందన్నారు. ఈ కేవైసి నమోదు వల్ల డీలర్ల సేవలు మరింత ఉత్కృష్ట మయ్యే అవకాశం ఉందన్నారు. అవక తవకలు,అక్రమాల కు ఆస్కారం ఉండకుండా చెక్ పెట్టవచ్చు అని స్పష్టం చేశారు.ఈ మధ్య కాలంలో అక్కడక్కడ గ్యాస్ సిలిండర్ల అక్రమ రీ ఫిల్లింగ్ కేసులు నమోదు ఐన ఉదంతాలను రఘునందన్ ఉదహరించారు.

Related News

Select the Topic
Scroll to Top