EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ఘనంగా ఉమేష్ చంద్ర ఐపిఎస్ 58వ జయంతి వేడుకలు

హైదరాబాదు మార్చ్ 29 (eetarambharatamన్యూస్);:  స్వర్గీయ చదలవాడ ఉమేష్ చంద్ర ఐపిఎస్ 58వ జయంతి సందర్భంగా ఎస్సార్ నగర్ యందు గల ఉమేష్ చంద్ర ఐపీఎస్ విగ్రహానికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి మరియు ఉమేష్ చంద్ర తండ్రి వేణుగోపాల్ గారితో కలిసి పూలదండలు వేయడం జరిగింది ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి ఉమేష్ చంద్ర గారి సేవలను కొనియాడారు. అనంతరం ఉమేష్ చంద్ర గారి తల్లి ‘తార’ గారిని పరామర్శించారు. ఈ కార్యక్రమమునకు పోలీసు ఉన్నతాధికారులు, వికారాబాద్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ సాయి చౌదరి, ఉమేష్ చంద్ర అభిమానులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.

 

 

 

 

Related News

Select the Topic
Scroll to Top