హైదరాబాద్ నవంబర్ 13 (ఈతరం ఇండియా న్యూస్ );మోహన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చిక్కడపల్లి త్యాగరాయగాన సభలో కళావైభవం పేరుతో మూడు రోజులపాటు సంగీతం, నృత్యం, నాటకోత్సవాలు ఘనంగా ముగిసాయి. ఈ సందర్భంగా సంస్థ తరపున 100 మందికి 10 కిలోల చొప్పున బియ్యం పంపిణి చేసారు. ఈ కార్యక్రమానికి బీసి కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణ మోహన్ రావు ముఖ్య అతిధిగా విచ్చేసి బియ్యం పంపిణి చేసారు. ఈ సందర్బంగా మోహన్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మోహన్ గాంధీ మాట్లాడుతూ ప్రతి ఏటా తమ సంస్థ నిర్వహించే ఈ కార్యక్రమంలో నిరుపేదలకు బియ్యం పంపిణీ చేయడము లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు . మొత్తం లక్ష కేజీల బియ్యాన్ని పంపిణీ చేయాలన్న సంకల్పంతో తాము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమం లో హెల్ టాటామని చారిటబుల్ ట్రస్ట్ కాకుమాను జ్యోతి, ప్రతిభ ఆధ్వర్యంలో పదిమందికి 100 కేజీల బియ్యాన్ని అందజేశారు.ఈ కార్యక్రమం లో పలువురు కళాకారులు పాల్గొన్నారు.
















