హైదరాబాద్ జనవరి 30 (ఈ బీ న్యూ స్);ప్రముఖ సిని నటుడు మెగాస్టార్ చిరంజీవి కి పద్మవిభూషణ్ అవార్డు వచ్చిన సందర్భముగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కార్యవర్గ సభ్యులు శుభాకాంక్షలు తెలియజేసారు. స్వయంకృషితో పైకొచ్చిన నటుడు చిరంజీవికి పద్మవిభూషణ్ రావడం తెలుగు వారందరికీ గర్వకారణం అని వారి పేర్కొన్నారు.సవిక్లబ్స్ ఇంటర్నేషనల్ లో జరిగే సేవా కార్యక్రమాల గురించి వివరించి త్వరలో వారు నిర్వహించబోయే ఒక ముఖ్య మైన ఒక కార్యక్రమానికి రావలిసినది గా ఆహ్వానించగా చిరంజీవి సానుకూలంగా స్పందించినట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ మాజీ అధ్యక్షులు ఆగిరి వెంకటేష్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ముక్తా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు















