ప్రముఖ కవి కీర్తి పురస్కార గ్రహీత డాక్టర్ ఉమ్మడి సింగు రాఘవరావు రచించిన చిరునవ్వు గ్రంథావిష్కరణ సభ శ్రీ మానస ఆర్ట్స్ థియేటర్స్, చిరునవ్వు సంస్థల ఆధ్వర్యంలో హైదరాబాదులోని త్యాగరాయ గనసభలో ఘనంగా జరిగింది. డాక్టర్ నిష్ఠల గోపాలకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ప్రసిద్ధ సాహితీవేత్త ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై చిరునవ్వు గ్రంధాన్ని ఆవిష్కరించారు. అనంతరం కసిరెడ్డి మాట్లాడుతూ గ్రంధకర్త రాఘవరావు కవితలు హైకు ప్రక్రియలో ఉన్నందున ఈ 17 అక్షరాలలో అనంతమైన వైవిద్య భరితమైన భావాలను వెలిబుచ్చారని అన్నారు. ఎక్కువ కవితలు వ్యంగ ధోరణిలో సాగాయని సామాజిక అంశాలను జోడించడం పట్ల చిరకాలం నిలిచే గా ఉన్నాయని కొనియాడారు. అనంతరం కవి ఉమ్మడి సింగు రాఘవరావును ఆత్మీయంగా సత్కరించారు. మానస సంస్థ నిర్వాహకులు బండారు రామచందర్రావు, దైవజ్ఞ శర్మ, సత్య శ్రీ, డాక్టర్ రాధాకుసుమ లు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులు ఆలపించిన భక్తి గీత భక్తి గీతాలు సభికులను అలరించాయి.