హైద్రాబాద్ సెప్టెంబర్.20.ఈతరం భారతం ప్రతినిధి: దామగుండం అడవిని కాపాడండి.. 1200000 చెట్లని నరికేయడానికి రంగం సిద్దమైనది.. ఈ విషయం తెలిసి ఇదివరకు కూడా ధర్మ చక్రం సంస్థ అధ్యక్షురాలు యామినీ లక్ష్మీ దీని పై స్పందించారు.. తీవ్ర బాధాకరమని, వెంటనే తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ గారు చెట్లని నరికేసే పని ఆపేయాలి అని, రాడర్ స్టేషన్ పర్మిషన్ రద్దు చేసి పచ్చని ప్రకృతి తో ఎంతో స్వచ్ఛమైన ఆక్సిజన్ ఇచ్చే దామగుండం అడవిని కాపాడాలి.. వికారాబాద్, అనంతగిరి అటవీ ప్రాంతానికి ఆనుకుని వున్న ఈ దామగుండం అడవిని రక్షించుకునే భాద్యత అందరికీ వుంది అని.. సాధారణంగా ఒక చెట్టు ఇద్దరి నుంచి పది మంది కి 250-300 కిలో గ్రాముల ఆక్సిజన్ సంవత్సరానికి ఇస్తుంది.. అని, మరి రేవంత్ గారు ఈ పని చేస్తే రేపు ఎన్ని ఆక్సిజన్ సిలిండర్లు ప్రజలకి ఇస్తారో? చెప్పాలని.. యామినీ లక్ష్మీ డిమాండ్ చేశారు. వెంటనే ఈ పర్మిషన్ వెనక్కి తీసుకోవాలి లేకపోతే మళ్ళీ ముఖ్య మంత్రి సీట్ లో కూర్చోవడం కలగా మిగిలి పోతుందని అన్నారు.. దామగుండం అడవిని కాపాడండి దయచేసి అని అందరికీ పిలుపు నిచ్చారు..















