హైద్రాబాద్ డిసెంబర్.19.(ఈతరం న్యూస్) గత తొమ్మిదేళ్లుగా చేనేత రంగంలో పేరుకుపోయిన అనేక సమస్యలను శీఘ్రగతిన పరిష్కరించాలని చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ను బిసి రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేష్ నేతృత్వంలో సమితి కేంద్ర కమిటీ సభ్యులు మంగళవారం సెక్రటేరియట్లో కలిసి విజ్ఞప్తి చేశారు.. తొమ్మిదేళ్లుగా చేనేత సహకార సంఘ ఎన్నికలు నిర్వహించబడకుండా వ్యవస్థ నిర్వీర్యమయ్యిందని, లోపాలను ప్రశ్నించే గొంతుక లేకుండా ఈ వర్గపు నాయకత్వాన్ని గత ప్రభుత్వం అణచివేసిందని పేర్కొన్నారు..
గడచిన తొమ్మిదేళ్లలో లో మృతి చెందిన చేనేత రంగపు కుటుంబాలను ఆదుకున్న నాధుడు కరువయ్యాడని , వెంటనే బాధిత కుటుంభాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా, సొంత ఇంటిని కూడా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.. చేనేత రంగంలో నకిలీలు విజృంభిస్తున్న తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో విధిగా హ్యాండ్లూమ్,సిల్క్ మార్కులను వినియోగింపజేసి వినియోగదారులకు నమ్మకాన్ని పెంపొందించేలా ప్రభుత్వం ఈ రంగానికి అండగా ఉండాలన్నారు.. షాపింగ్ మాల్ లో మోసాలను కట్టడి చేసి వినియోగదారులకు నాణ్యమైన పట్టు చీరలు, చేనేత చీరలను అందజేసే టెస్కో షోరూమ్లను ప్రతి జిల్లాలో అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.. ఈ కార్యక్రమంలో బిసి రాజ్యాధికార సమితి గ్రేటర్ హైదరాబాద్ మహిళా ప్రధాన కార్యదర్శి గోశిక స్వప్న మీడియా కన్వీనర్ మారేపల్లి లక్ష్మణ్, యువ నాయకులు పైరసాని దుర్గేష్ మడత కిషోర్ తదితరులు పాల్గొన్నారు
















