హైదరాబాద్ ఫిబ్రవరి 4 (ఈ బీ న్యూస్);: తెలంగాణపై ఉమ్మడి రాష్ట్రంలో జరిగినా నిర్లక్ష్యం కంటే కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన నిర్లక్ష్యం, నష్టమే ఎక్కువ అని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది.. జగన్ ప్రాజెక్టుల జోలికి రాగలరా..? దమ్ముంటే రావాలన్నట్లుగా రేవంత్ సవాల్ చేశారు. ఆదివారం నాడు తెలంగాణ సచివాలయంలో మీడియాతో మాట్లాడిన రేవంత్.. ఇంట్లో నుంచి మాజీ సీఎం కేసీఆర్ బయటకు వచ్చే మొహం చూపించలేక డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు పొద్దున్నే కేసీఆర్ డ్రామాలు మొదలు పెట్టారని మండిపడ్డారు. రం*** పనులు చేసింది.. లొంగిపోయింది కేసీఆర్ అని దెప్పిపొడిచారు. కేసీఆర్ రం.. గాడు… కాబట్టే.. ఏపీ సీఎం జగన్ ప్రాజెక్టులను ఆక్రమించుకున్నారని రేవంత్ ధ్వజమెత్తారు.తెలంగాణలో ఉన్న నాగార్జున సాగర్ పైకి ఏపీ సీఎం జగన్.. పోలీసుల తుపాకులతో సాగర్ ప్రాంతమంతా చుట్టుముడితే కేసీఆర్ ఎందుకు సైలెంట్‌గా ఉన్నారని ప్రశ్నించారు. కేసీఆర్ ధనదాహం వల్లే కృష్ణా నది జలాలు తరలిపోయాయని ధ్వజమెత్తారు. రోజుకు 14 టీఏంసీల నీళ్లను తెలంగాణకు రాకుండా దోచుకెళ్లారని మండిపడ్డారు. దారి దోపిడీ, జల దోపిడీ జరగడానికి కారణం కేసీఆర్ అనే చెప్పారు. పోతిరెడ్డి పాడు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, ముచ్చుమర్రిలను ఆక్రమించుకోవడానికి గతప్రభుత్వాలు ప్రయత్నించలేదా..? అని రేవంత్ ప్రశ్నించారు. తెలంగాణ వచ్చినా తర్వాత SLBC ప్రాజెక్టు ఎందుకు పూర్తిచేయలేదని ప్రశ్నించారు.
అప్పుడేం చేశారు కేసీఆర్!
పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ముందుకు సాగకుండా ఏపీ సీఎం జగన్ స్టే తెచ్చారని ధ్వజమెత్తారు. 2004లో అప్పటి టీఆర్ఎస్ నుంచి నాయిని నర్సింహారెడ్డి కడప జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉన్నారని గుర్తుచేశారు. పోతిరెడ్డిపాడును ఆక్రమించుకోవడానికి ప్రయత్నించినప్పుడు.. కేంద్రంలో కేసీఆర్, ఆలే నరేంద్ర మంత్రులుగా ఉన్నారన్న విషయాన్ని రేవంత్ గుర్తుచేశారు. పదవులకు ఆశపడి పెదవులు మూసుకున్నది ఆనాటి టీఆర్ఎస్ నేతలు కాదా..? అని ప్రశ్నించారు. ఆనాడు పదవుల కోసం లొంగిపోయిన హరీష్ రావు మంత్రి అయ్యారన్నారు. దివంగత ముఖ్యమత్రి రాజశేఖర్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై కొట్లాడింది కాంగ్రెస్ నేతలు జనార్ధన్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి అని చెప్పారు.
కేసీఆర్‌పై ప్రశ్నల వర్షం
తెలంగాణ నీటి కోసం కాంగ్రెస్ నేతలు కొట్లాడుతుంటే కేసీఆర్ సైలెంట్‌గా ఉన్నారని మండిపడ్డారు. జనవరి 14, 2020 నాడు కేసీఆర్ ఇంటికి జగన్ వచ్చి కృష్ణా జలాలపై ఆరు గంటలు రివ్యూ చేయలేదా..? అని నిలదీశారు. జగన్ రాయలసీమ లిఫ్ట్ ద్వారా నీటిని తరలించుకుపోయడని ధ్వజమెత్తారు. రాయలసీమకు నీటిని తరలించుకోవడానికి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నారు. కేసీఆర్ కేవలం కమీషన్లకు లొంగిపోయి జగన్‌తో చీకటి ఒప్పందాలు చేసుకున్నారని దుయ్యబట్టారు. కృష్ణానదిపై ఉన్న 15 ప్రాజెక్టులను.. కేఆర్ఎంబీ(KRMB) కు అప్పగిస్తామని 2022 మే 27 నాడు కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదా..? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
తెలంగాణకు రావాల్సిన నీటి వాటాపై స్పష్టత వచ్చే వరకూ తమ ప్రాజెక్టులు అప్పగించేది లేదని కేంద్ర ప్రభుత్వానికి, కృష్ణా బోర్డుకు తేల్చిచెప్పామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కృష్ణా పుట్టిన ప్రాంతం నుంచి ఆ నది పారే వరకూ ఉన్న ప్రాజెక్టులన్ని ఆ బోర్డు పరిధిలోకి తేవాలని కేంద్ర మంత్రికి చెప్పామన్నారు. ఆదివారం నాడు తెలంగాణ సచివాలయంలో మీడియాతో మాట్లాడిన రేవంత్.. ఇంట్లో నుంచి మాజీ సీఎం కేసీఆర్ బయటకు వచ్చే మొహం చూపించలేక డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు పొద్దున్నే కేసీఆర్ డ్రామాలు మొదలు పెట్టారని మండిపడ్డారు. రం*** పనులు చేసింది.. లొంగిపోయింది కేసీఆర్ అని దెప్పిపొడిచారు. కేసీఆర్ రం.. గాడు… కాబట్టే.. ఏపీ సీఎం జగన్ ప్రాజెక్టులను ఆక్రమించుకున్నారని రేవంత్ ధ్వజమెత్తారు.















