27.1.2024 ఖమ్మం బ్యూరో.నలుబోల మధులత.(ఈ బీ న్యూస్) ఖమ్మం నగరంలో ఆదివారము ఉదయం 10 గంటలకు స్థానిక ప్రకాష్ నగర్ బ్రిడ్జి దగ్గర కాళ రామారావు మామిడి తోట లో ఖమ్మం జిల్లా పెరకకుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నామని ఖమ్మం జిల్లా అధ్యక్షులు గజ్జవెల్లి సత్యనారాయణ తెలిపారు . ఈ సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి , పెరక కుల బిడ్డ అదిలాబాద్ ఎమ్మెల్యే పాయలి శంకర్ మరియు రాష్ట్ర సంఘ అధ్యక్షులు మద్దా లింగయ్య , రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రామ్ , మాజీ ఎమ్మెల్యే భద్రయ్య , గటిక విజయకుమార్ , ఉమ్మడి ఖమ్మం జిల్లా పెరిక సంఘం నాయకులు తదితరులు పాల్గొంటారని తెలిపారు . కాబట్టి ఖమ్మం జిల్లాలోని వివిధ గ్రామాల కుల బంధువులు , నగరంలోని కుల బంధువులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ ఆత్మీయ సమ్మేళనం జయప్రదం చేయగలరని కోరారు . ఈ కార్యక్రమంలో అధికార ప్రతినిధి సోమిశెట్టి వెంకటేశ్వరరావు , ప్రధాన కార్యదర్శి చింతల లింగేశ్వర రావు , ఖమ్మం నగర అధ్యక్షులు గజ్జల వెంకన్న మరియు కార్యదర్శి మలల అప్పారావు తదితరులు పాల్గొన్నారు .















