హైదరాబాద్ సెప్టెంబర్19 (ఈతరం భారతం); ఒకేదేశం ఒకే ఎన్నిక గురించి క్యాబినెట్ మీటింగ్ పెట్టి చర్చించే ముందు ప్రజలకు గూడ వాస్తవాలు తెలియజేయాలని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేసారు.గురువారం గాంధీ భవన్ లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ రామ్ నాధ్ కోవిధ్ గారి రిపోర్ట్ లో వాస్తవాలు లేవు ఆ కమిటీ దేశం లో ఎవరిని కలిసి మాట్లాడారు ఎక్కడ మీటింగ్ పెట్టారు అనేది క్లారిటీ లేదన్నారు.జమిలి ఎన్నికలు పెట్టాల్సి వస్తే 18 సవరణలు చేయాల్సి వస్తది ఇపుడు జరుగుతున్న 4 రాష్ట్రాలలో ఒకే సారి ఎన్నికలు జరుపలేఖ పోతున్నారు దేశం అంత ఒకేసారి ఎలా సాధ్యం,బీజేపీ నాయకులు ప్రజలను తప్పు తోవ పట్టిస్తున్నారు 2/3ఆమోదం తెలుపలి లోక్ సభ లో 362 ఎంపీల మద్దతు, రాజ్యసభ లో 164 ఎంపీ ల మద్దతుకావాలి,14రాష్ట్రాలు సపోర్ట్ చేయాలి.బీజేపీ నాయకులు ప్రజల ద్రుష్టి మల్లించడానికి ఇటువంటి డైవెర్షన్ రాజకీయాలు చేస్తున్నారు ఒకే దేశం ఒకే ఎన్నిక అని చెప్పడానికి ఈజీ గా,వినడానికి చాలా బాగుంది కాని చాలా సవరణలు చేయాల్సి వస్తుంది.గతం లో పెద్ద నోట్ల రద్దు గూడ ఇదే విదంగా ఎవరికీ తెలియకుండా చేశారు దాని వల్ల ఎంత లాభం జరిగింది ఎన్ని లక్షలు కోట్లు నల్ల ధనం వచ్చింది.బీజేపీ డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలి జమిలి ఎన్నికల పై ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం ఒకేసారి ఎన్నికలు మంచివే… కానీ సాధ్యసాధ్యాలు ఆలోచించాలి..రాష్టాల ఆమోదం లేకుండా జమిలి ఎన్నికలు నిర్వహణ అసాధ్యం… ఎందుకంటె ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు, పరికరాలు, సిబ్బంది కూడా సరిపడ ఉండాలి.కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలు నిర్వహించే సత్తా ఉన్నప్పుడు… మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలు ఒకే సారి ఎందుకు నిర్వహించ లేదు.. ప్రపంచంలో 194 దేశాలున్నాయి. కేవలం 10దేశాల్లోనే జమిలి ఎన్నికలు నడుస్తున్నాయి.. లోక్సభ పదవీకాలాన్ని నిర్ణయించే ఆర్టికల్ 83, అసెంబ్లీల పదవీకాలాన్ని నిర్ణయించే ఆర్టికల్ 172లో.. మూడేసి సెక్షన్లను ప్రధానంగా సవరించాల్సి ఉంటుంది.















