జర్నలిస్టులకు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చేయూత
వరద బాధిత జర్నలిస్టులకు నిత్యవసరంల పంపిణీ
జర్నలిస్టు కుటుంబాలకు ఏ కష్టం వచ్చినా నేనున్నా
:ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
06.09.2024 ఈతరం భారతం ఖమ్మం : రీజినల్ నెట్వర్క్ ఇంఛార్జి నలుబోల మధు శ్రీ
జర్నలిస్టులకు ఏ సమస్య వచ్చినా నేనున్నానని మరోసారి చాటిచెబుతూ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర వరద బాధిత జర్నలిస్టులకు చేయూతను అందించారు. భారీ వరదలకు ఖమ్మం లోని అనేక ప్రాంతాలు జలమయమై తీవ్ర నష్టానికి గురిచేశాయి. వరద దాటికి సర్వం కోల్పోయి కట్టుబట్టలే మిగిలిన పరిస్థితుల్లో పలువురు వరద బాధిత జర్నలిస్టుల కుటుంబాలకు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. వద్దిరాజు రవిచంద్ర నివాసంలో శుక్రవారం పలువురు జర్నలిస్టులకు నిత్యవసర సరుకులు అందజేశారు.ఈ సందర్భంగా వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ జర్నలిస్టుల కుటుంబాలకు ఏ సమస్య వచ్చినా తను ఉన్నానని, గతంలో కూడా అనేక సందర్భాలలో జర్నలిస్టులకు తన వంతు సహాయ సహకారాలు అందించడం జరిగిందని, భవిష్యత్తులో కూడా జర్నలిస్టులకు ఏ కష్టం వచ్చినా తన వంతు సహకారం ఉంటుందన్నారు. వరదల వల్ల తీవ్ర నష్టం వాటిల్లిందని, వారికి చేదోడు వాదోడుగా అండగా ఉండాలన్న సంకల్పంతో వరద బాధితులకు ఉడత భక్తిగా తన వంతు సహాయం చేస్తున్నానని తెలిపారు.ఈ కార్యక్రమంలో టి యు డబ్ల్యూ జే (ఐజేయు) రాష్ట్ర కార్యదర్శి కె. రామనారాయణ, టి యు డబ్ల్యూ జె (టి జె ఎఫ్) జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శి చిర్రా రవి,డబ్ల్యూ జే (ఐజేయు) జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మాటేటి వేణు, ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు సివిఆర్ శ్రీను, నగర అధ్యక్షులు యలమందల జగదీష్, యూనియన్ నగర అధ్యక్షులు బి. రాఘవ, (ఐజే యు) నగర ప్రధాన కార్యదర్శి చెరుకుపల్లి శ్రీనివాస్ , జిల్లా నాయకులు అమ్మ ఉపేందర్, రాజు, ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కొరకొ ప్పల రాంబాబు, వెంకటకృష్ణ, సాయి, ఉత్కంఠం శ్రీను, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.















