EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

జర్నలిస్టు బైరిశెట్టి రవీందర్ రావు మృతి – టీడబ్ల్యూజేఎఫ్ సంతాపం.

ఈతరం భారతం హైదరాబాద్ ప్రతినిధి 3.3.2024 : హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్(హెచ్ యూజే) మాజీ జాయింట్ సెక్రటరీ, అంబర్ పేటకు చెందిన సీనియర్ జర్నలిస్టు బైరిశెట్టి రవీందర్ రావు  కన్నుమూశారు. ఉదయం పత్రిక నుంచి పలు పత్రికల్లో విలేకరిగా పని చేసిన రవీందర్ రావు గత కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం కొంత మెరుగుపడి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుండగా బుధవారం ఉదయం గుండెపోటు వచ్చి మృతి చెందారు. ఆయనకు భార్య, కొడుకు కూతురు ఉన్నారు. ఆయన నివాసం అంబర్ పేట బాపూనగర్ లోని ప్రగతి స్కూల్ ఎదురుగా ఉన్న విజయ టవర్స్. రవీందర్ రావు మృతికి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ సంతాపం తెలియజేస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుందని twjf రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య ఒక ప్రకటనలో చెప్పారు.

Related News

Select the Topic
Scroll to Top