ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల, ఖమ్మం.
జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ లో అంబేద్కర్ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన గౌరవ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు , మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు మరియు జిల్లా కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు.ఈ సంధర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు.
“భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనా మార్గంలో మనందరం నడవడమే ఆయనకు మనం అర్పించే నిజమైన ఘన నివాళి.అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.భారతరత్న అంబేద్కర్ భారతదేశంలో పుట్టడం మనందరి అదృష్టం గర్వకారణం.ప్రపంచ మేధావిగా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల చట్టాలను అధ్యయనం చేసి దేశానికి అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించిన సామాజికవేత్త అంబేద్కర్.ప్రజాస్వామ్యయుతంగా బలమైన పునాదులతో ఈ దేశం నిర్మించబడింది అంటే అంబేద్కర్ ఇచ్చిన భారత రాజ్యాంగం ఫలితమే.అసమానతలు, తారతమ్యాలతో, సంక్లిష్టంగా, వ్యవస్థీకృతమైన ఈ దేశంలో ఎలాంటి రక్తపాతం లేకుండా రాజ్యాంగం అనే గ్రంథం ద్వారా అనేక మార్పులకు నాంది పలికిన మహనీయుడు అంబేద్కర్.పురుషులతో సమానంగా మహిళలకు సమానమైన హక్కులను రాజ్యాంగంలో పొందుపరిచిన తాత్వికవేత్త అంబేద్కర్.కార్మికులకు ఎనిమిది గంటల పని విధానం కార్మిక హక్కులను రాజ్యాంగంలో పొందుపరిచి కార్మిక పక్షపాతిగా నిలిచిన అంబేద్కర్.సామాజిక, ఆర్థిక తేడా లేకుండా ప్రతి పౌరునికి సమానంగా ఓటు హక్కు కల్పించి కావలసిన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి వరం అందించిన గొప్ప రాజనీతజ్ఞుడు అంబేద్కర్.విప్లవాత్మకమైన ఆలోచనతో భారత రాజ్యాంగాన్ని దేశానికి అందించి ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశంగా నిలబడటానికి కారకులు అంబేద్కర్ అని చెప్పారు.
భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ స్ఫూర్తితో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగాన్ని ఇప్పటి వరకు తూ.చా తప్పకుండా అమలు చేస్తున్నది,అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని మార్చాలని కొన్ని పార్టీలు కుట్రలు కుయుక్తులు చేస్తున్నాయి అన్నారు.భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రజాస్వామ్యవాదులు రాజ్యాంగ ప్రేమికులు ఏకం కావాలి.భారత రాజ్యాంగం పరిరక్షనే ప్రజాస్వామ్య పరిరక్షణ.భారత రాజ్యాంగం మార్చడం అంటే ప్రజాస్వామ్యం పై దాడి చేయడమే అన్నారు.దేశంలో ప్రజాస్వామ్యం కూలిపోతే పౌరులకు వాక్ స్వాతంత్రం, ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది.భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణకు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ గారల నాయకత్వంలో అనేక ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాము అని చెప్పారు.భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం కాంగ్రెస్ శ్రేణులు నడుం బిగించి ముందుకు కదలాలి.తెలంగాణలో ఏర్పడిన ఇందిరమ్మ రాజ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అంబేద్కర్ స్ఫూర్తితో వడి వడిగా అడుగులు వేస్తూ ముందుకు వెళుతున్నది.అప్పులతో కూడిన రాష్ట్రాన్ని చిందరవందర చేసి చేతికిచ్చినప్పటికీ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టాం. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం చేసే ఏజెన్సీ మహిళలకుగత ప్రభుత్వంపెండింగ్ పెట్టిన బిల్లులను చెల్లించాం.ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తూ సంవత్సరాల తరబడి వేతనం లేనటువంటి స్వీపర్లకు, ఆశ, అంగన్వాడి వర్కర్లకు ప్రతినెల వేతనాలు చెల్లిస్తున్నాము.ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో పెండింగ్ లో ఉన్న డైట్ బిల్లులను చెల్లించాం.సమాజంలో సగభాగం ఉన్న మహిళలు ఆర్థిక సాధికారత సాధించడానికి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్సార్ హయాంలో ప్రవేశపెట్టిన వడ్డీ లేని రుణాలను తిరిగి ఇందిరమ్మ రాజ్యంలో అమలు చేస్తున్నాం ఆన్నారు.
డిసెంబర్ 7న అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిన్నటి వరకు మహిళలకు ఇచ్చిన రుణాలపై వడ్డీలను ఈ ప్రభుత్వమే చెల్లించింది.లక్ష కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు ఆర్థికంగా అందించి వారిని బలోపేతం చేయడం కోసం ప్రభుత్వమే వారికి ఇచ్చిన రుణాలపై వడ్డీలను చెల్లిస్తుంది.ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులను సమీకరించింది.కాంగ్రెస్ ప్రకటించిన గ్యారెంటీలను అధికారంలోకి రాగానే అమలు చేస్తున్నాం.మహిళలకు 500 రూపాయలకే సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తు, 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తదితర గ్యారెంటీలను అమలు చేస్తున్నాం.సమాజంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలు తలెత్తుకొని ఆత్మగౌరవంతో బతికే విధంగా అంబేద్కర్ స్ఫూర్తితోనేగ్యారంటీలను అమలు చేస్తున్నాము అని వివరించారు.
రానున్న 25 సంవత్సరాలు
రూ.5.59లకు యూనిట్ చొప్పున సోలార్ విద్యుత్ అందించడానికి సోలార్ కంపెనీలు ముందుకు వస్తున్నాయి
ఎన్ టి పి సి విద్యుత్ ఉత్పత్తి చేయడం వల్ల యూనిట్ కు దాదాపు 9 రూపాయల వ్యయం అవుతుంది
సోలార్ విద్యుత్తు యూనిట్ కు ఐదు రూపాయల 59 పైసలకే ప్రజలకు అందే పరిస్థితిలో…. యూనిట్ కు 9 రూపాయల వ్యయంతో తయారయ్యే ఎన్ టి పి సి విద్యుత్తు అవసరమా ప్రజలు ఆలోచించాలి.పది సంవత్సరాల పాలనలో బిఆర్ఎస్ పాలకులు చేసిన తప్పిదాలను అవినీతి అక్రమాలను తప్పకుండా బయటకు తీస్తాం అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో వీరితో పాటు పంచాయితిరాజ్ సంఘటన్ Aicc కన్వీనర్ కిరణ్ ముగభాత్సవ్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మెన్ రాయల నాగేశ్వరరావు, నగర కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు మహ్మద్ జావేద్, నగర వర్కింగ్ కమిటి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, రాష్ట్ర obc సెల్ నాయకులు వడ్డేబోయిన నరసింహారావు, జిల్లా యువజన కాంగ్రెస్ అద్యక్షులు యడ్లపల్లి సంతోష్ ,OBC సెల్ అద్యక్షులు పుచ్చకాయల వీరభద్రం,SC సెల్ అద్యక్షులు బొడ్డు బొందయ్య , మైనారిటీ అద్యక్షులు సయ్యద్ ముజాహిద్ హుస్సేన్, కిసాన్ కాంగ్రెస్ అద్యక్షులు మొక్కా శేఖర్ గౌడ్,,బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు యర్రం బాల గంగాధర్ తిలక్,కార్పొరేటర్లు మలీదు వేంకటేశ్వర్లు, సైదులు నాయక్, రాపర్తి శరత్ ,మిక్కిలినేని నరేందర్, బొజెడ్ల సత్యనారాయన, వెనిగండ్ల సత్యనారాయన, బాలాజి నాయక్, సంపటం నరసింహరావు,తవిడబోయిన రవి, గజ్జెల్లి వెంకన్న, గంగరాజు యాదవ్, కమతం రామక్రిష్ణ, బీరెడ్డి రమేశ్, గడ్డం వెంకటయ్య,ఏలూరి రవికుమార్,అనిల్ కుమార్,Md Y పాషా, బుల్లెట్ బాబు, ఐనాల నరసింహరావు, మట్టా రవీందర్ రెడ్డి, గజ్జి సూర్యనారాయణ తదితర నాయకులు పాల్గొన్నారు.















