హైదరాబాద్ ఏప్రిల్ 30 (ఈతరం భారతం న్యూ స్) : రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో 91.31 శాత్తం ఉత్తీర్ణత సాధించారు. అయితే టెన్త్ ఫెయిలైన విద్యార్థులకు జూన్ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ కొనసాగనుంది. ఫెయిలైన విద్యార్థులు సంబంధిత పాఠశాలల్లో మే 16వ తేదీ లోపు పరీక్ష ఫీజు చెల్లించాలి. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు 15 రోజుల పాటు అవకాశం కల్పించారు. రీకౌంటింగ్‌కు రూ. 500, రీవెరిఫికేషన్‌కు రూ. 1000 చెల్లించాల్సి ఉంటుంది
.















