EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

జ్యోతిబాపూలే 150 అడుగుల విగ్ర‌హాన్ని ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలి  బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేశ్ డిమాండ్  

హైదరాబాద్ ఏప్రిల్ 11 (ఈతరం భారతం న్యూ స్); సంఘ సంస్క‌ర్త‌, వెనుక‌బ‌డిన వ‌ర్గాల ఆశాకిర‌ణం మ‌హాత్మా జ్యోతిబా పూలే 150 అడుగుల విగ్ర‌హాన్ని నెక్లెస్ రోడ్ లో ఏర్పాటు చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని బీసీ రాజ్యాధికార స‌మితి అధ్య‌క్షులు దాసు సురేష్ డిమాండ్ చేశారు. జ్యోతిబా పూలే 198వ జ‌యంతిని బాగ్ లింగంప‌ల్లిలోని బీసీ రాజ్యాధికార స‌మితి ప్ర‌ధాన కార్యాల‌యంలో ఘ‌నంగా నిర్వ‌హించారు. జ్యోతిబా పూలే ప‌టానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. తదనంతరం అంబర్పెపేట్ లోని జ్యోతిభాఫూలే విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. భవిష్యత్ బీసీలదేనని నినదించారు ..తదనంతరం మీడియాతో మాట్లాడుతూ బ‌డుగుల ఉన్న‌తికి జ్యోతిబా పూలే చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. నెక్లెస్ రోడ్ లో అంబేద్క‌ర్ భారీ విగ్ర‌హం త‌ర‌హాలోనే జ్యోతిబాపూలేకు కూడా 150 అడుగుల విగ్ర‌హన్ని ఏర్పాటు చేయాల‌ని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.. చారిత్రక అంశాలతో కూడిన ఫూలే స్మృతివనాన్ని నెక్లెస్ రోడ్ లో ఏర్పాటు చేయాలన్నారు ఇదే ప్రాంగణంలో జ్యోతిబా పూలే పేరిట బీసీ నాలెడ్జ్ పార్క్ ను ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వంద కోట్ల‌తో నిధని ఏర్పాటు చేసి ప్ర‌తి ఏటా జ్యోతిబా పూలే పేరిట సంఘ సంస్కర్తలకు అవార్డులు ప్రధానం చేయాలని దాసు సురేష్ సూచించారు. భార‌త అత్యున్న‌త పౌర పుర‌స్కారం భార‌త ర‌త్న‌ను జ్యోతిబా పూలేకు ఇవ్వాల‌ని, పూలే జ‌యంతిని జాతీయ సెల‌వుదినంగా ప్ర‌క‌టించాల‌ని కేంద్ర ప్రభుత్వానికి దాసు సురేష్ డిమాండ్ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో బీసీ రాజ్యాధికార స‌మితి పొలిటిక‌ల్ అఫైర్స్ క‌మిటీ ఛైర్మ‌న్ తుల‌సి శ్రీమాన్‌, మీడియా క‌న్వీన‌ర్ మారేప‌ల్లి ల‌క్ష్మ‌ణ్ సిటీ కమిటీ సభ్యులు ప్యారసాని దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు

 

 

Related News

Select the Topic
Scroll to Top