సికింద్రాబాద్ జనవరి 30 (ఈ బీ న్యూ స్);టిబి పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని లీడ్ సంస్థ సిపీఎల్ మితిలేష్ శర్మ పిలుపు నిచ్చారు. లీడ్ స్వచంద సంస్థ అధ్వర్యంలో లో టిబి అవగాహన ర్యాలీ కంటోన్మెంట్ లోని మడ్ఫర్డ్ హట్స్ స్లం లో నిర్వహించ్జరు.ఈ సందర్బంగా మితిలేష్ శర్మ మాట్లాడుతూ వారం కంటే ఎక్కువ దగ్గు జ్వరం బరువు తగ్గడo ఉంటే వెంటనే దగ్గర లోని ప్రభుత్వ హాస్పిటల్ లో పరీక్షలు చేపించుకొని క్రమం తప్పకుండా ఆరు నెలలు మందులు వాడాలని తెలిపారు.అలాగే ఇతరులకు సోకకుండా మాస్క్ ధరించాలన్నారు.మందులు వాడుతున్న సమయం లో పోషక ఆహారం తో పాటు ప్రతి ఒక్కరికి ప్రతి నెల 500 రు ప్రభుత్వం నుండి అందజేస్తారు అని తెలిపారు ఈ కార్యక్రమంలో లీడ్ సంస్థ ప్రతినిధులు సతీష్,శ్యామల, మంజులత, శారద, స్లం పెద్దలు స్లం సభ్యులు పాల్గొన్నారు















