26.1.2024 ఖమ్మం బ్యూరో నలుబోల మధులత(ఈ బీ న్యూస్)
దేశంలోని ప్రజలందరికీ రాజకీయాలు, మతాలు, పార్టీలు, వర్గాలకతీతంగా రాజ్యాంగ ఫలాలు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధన మేరకు ప్రతి ఒక్కరికి సమానంగా అందేటట్లుగా కృషి చేయాలని యువతనుద్దేశించి పొంగులేటి ప్రధాన అనుచరుడు డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ పిలుపునిచ్చారు.
కామేపల్లి మండలం పండితాపురం గ్రామంలోని అంబేద్కర్ సెంటర్లో 75 వ గణతంత్ర వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మల్లిబాబు యాదవ్ మొదట బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి, తర్వాత త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, భగత్ సింగ్ అల్లూరి సీతారామరాజు, లాంటి మహనీయులు తమ ధన మాన ప్రాణాలను త్యాగం చేసి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పారద్రోలి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చి పెట్టారని, ఆ తర్వాత 1950 జనవరి 26న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అధ్యక్షతన మన దేశానికి ప్రత్యేక రాజ్యాంగం అమలులోకి వచ్చింది. మన దేశాన్ని మనమే ప్రజాస్వామికంగా పరిపాలించుకునే అవకాశం ఏర్పడింది. కానీ స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినప్పటికీ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలు ఇంకా పూర్తిస్థాయిలో నెరవేరలేదని, కొంతమంది రాజకీయ కుట్రల వలన బడుగుబలహీన వర్గాల వారు పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందలేకపోతున్నారని, ఆర్థిక రాజకీయ సామాజిక సమానత్వం కోసం ఇంకా పోరాటాలు చేయాల్సి రావడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సమానత్వం కోసం యువకులు ఉద్యమించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు పాటిబండ్ల ప్రసాద్, ఎల్ హెచ్ పి ఎస్ మండల అధ్యక్షులు భూక్య నాగేంద్రబాబు, మత్స్యశాఖ సొసైటీ అధ్యక్షులు మేకల మల్లికార్జునరావు, మాజీ సర్పంచ్ బానోతు నరసింహ నాయక్, మండల బీసీ నాయకులు మేకపోతుల మహేష్, గుండ్ల చిరంజీవి, మంద రవి, మేకల మహేష్, దాసరి గురేష్, దాసరి వెంకన్న, బండి ఉపేందర్, బండి లక్ష్మీ నర్సు, బొమ్మ గాని పిచ్చయ్య, దొడ్లవేణు చల్ల మల్లయ్య తోటకూరి భద్రయ్య,జక్కంపూడి వెంకటేశ్వర్లు, చల్ల సాంబయ్య, కొమ్మినేని శ్రీను తదితరులు పాల్గొన్నారు















