EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

తక్షణమే వాహన ర్యాలీ లకు బ్రేక్ వేయాలి

 

హైదరాబాద్ నవంబర్ 11 (ఈతరం ఇండియా న్యూస్ ); గెలుపు ఆరాటంలో వందల వాహనాలతో కాలుష్యాలు పోగుపెడుతున్నారని, తక్షణమే వాహన ర్యాలీలకు బ్రేక్ వేయాలని “ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ కౌన్సిల్ ” అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేసింది. శనివారం కౌన్సిల్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్సీహెచ్ రంగయ్య బాగ్ లింగం పల్లి కౌన్సిల్ కార్యాలయంలో మాట్లాడుతూ. .. వ్యవస్థ సంక్షేమానికి పాటు పడాల్సిన రాజకీయరంగం ఎన్నికల పేరుతో ధ్వంస రచనకు పాల్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులు వారి మెహర్బానీ కోసం ప్రచారంలో నిబంధనలకు మించి, పర్యావరణానికి విఘాతం జరుగుతున్నా ఉపయోగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాలుష్యాల కారణంగా మొన్నటి కరోనా విపత్తు సృష్టించిన నష్టం మరిచిపోరాదని ఆయన పార్టీలకు గుర్తు చేశారు. ప్రతి రాజకీయ పార్టీ విజ్ఞత పాటించి ప్రచారంలో వాహన శ్రేణి లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సంఘం కూడా మరింత నిఘా పెంచి తన వంతు పాత్ర నిర్వర్తించాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top