30.1.2024ఖమ్మం బ్యూరో.నలుబోల మధులత.(ఈ బీ న్యూస్)తప్పు చేస్తే ఎంతటి వారైనా శిక్ష అనుభవించక తప్పదని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం పత్రిక ప్రకటన విడుదల చేశారు. సోమవారం జిల్లా జైల్ లో రిమాండ్ లో ఉన్న పగడాల నాగరాజుని కలిసిన తర్వాత బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తాత మధు సుధన్ కామెంట్స్ పై ఆయన విరుచుకు పడ్డారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని ఏ పార్టీ అభ్యర్థి అయిన తప్పు చేస్తే శిక్ష అనుభవించక తప్పదు అన్నారు. రిమాండ్ లో ఉన్న వ్యక్తి గతంలో కూడా 2002 లో తనుకు లో సిగెరెట్ల లోడ్ లారీ డ్రైవర్ ను హత్య చేసిన ఘటన అక్కడ నుండి ఖమ్మం 2 టౌన్ పోలీస్ స్టేషన్ కు ట్రాన్స ఫర్ చేయనైనది, 2003లో రమణగుట్ట గౌస్ హత్య కేస్ లో దోషిగా ఉన్నారని,2 టౌన్ పోలీస్ స్టేషన్ లో రౌడీ షీటర్ గా ఉన్న అతనిని రౌడీ షీట్ తొలగించి ఇన్ని రోజులు BRS అధికార అండ దండలతో బయట పడ్డారని అన్నారు.కక్ష సాధింపు రాజకీయాలు చేసేది బిఆర్ఎస్ అని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టడం గత ప్రభుత్వంలో చూసామాని అలాంటి నియంతృత్వ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పి ప్రజా పాలనకు ప్రజలు పట్టం కట్టారని అన్నారు. బిఆర్ఎస్ నాయకులకు ఇది మింగుడు పడక కాంగ్రెస్ పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక నైనా తప్పుడు ఆరోపణలు మాని ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు.















