EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

తమ ఓటు తాము వేసుకొలేక పోయిన బరిలోకి దిగిన అభ్యర్థులు

హైదరాబాద్ మే 13 (ఈతరం భారతం న్యూ స్);ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ఎవరైనా.. మీ అమూల్యమైన ఓటు హక్కు వినియోగించుకొని తమను గెలిపించాలంటూ ఎన్నికల ప్రచారంలో ఓటర్లను అభ్యర్థిస్తూ ఉంటారు. అందుకు పంచాయతీ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దిగిన అభ్యర్థులు ఎవరు.. అందుకు మినహాయింపు కాదన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఓటర్లు వద్దకు వచ్చి తనను గెలిపించండంటూ అభ్యర్థించిన అభ్యర్థులే.. తాము బరిలో దిగిన నియోజకవర్గంలో వారికే ఓటు లేక పోవడం కొసమెరుపు.

అందుకు హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కొంపెల్ల మాధవి లత, ఎంఐఎం ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ, మల్కాజ్‌గిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్‌రెడ్డి. మే 13వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో.. వీరు ముగ్గురు బరిలో దిగినా… తమ గెలుపు కోసం వారికి వారు ఓటు వేసుకోక పోవడం గమనార్హం.

కొంపెల్ల మాధవి లత..

హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆమె బరిలో దిగారు. సికంద్రాబాద్‌ ఈస్ట్ మారెడుపల్లిలోని మహేంద్ర హిల్స్‌లో ఆమె నివసిస్తున్నారు. ఈ ప్రాంతం మల్కాజ్‌గిరి లోక్‌సభ పరిధిలోకి వస్తుంది. దీంతో మాధవి లత తన కోసం.. తన ఓటును వినియోగించుకోలేక పోయారు.

అసదుద్దీన్ ఓవైసీ..

హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. కానీ ఆయన నివాసం రాజేంద్రనగర్ పరిధిలో ఉంది. అంటే ఈ ప్రాంతం చేవెళ్ల లోక్‌సభ పరిధిలోకి వస్తుంది. అదీకాక చేవెళ్లలో ఎంఐఎం తరఫున ఎవరు బరిలో నిలవలేదు. దాంతో ఏదో పార్టీకి, ఎవరో ఒకరికి ఆయన ఓటు వేయాల్సి ఉంది. దీంతో అసదుద్దీన్ గెలుపునకు ఆయన సైతం ఓటు వేసుకోలేక పోయారు.

పట్నం సునీతామహేందర్‌రెడ్డి..

మల్కాజ్‌గిరి నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఆమె ఎన్నికల బరిలో నిలిచారు. ఆమె ఓటు తాండురు పరిధిలో ఉంది. ఈ ప్రాంతం చేవెళ్ల పరిధిలో ఉంది. ఈ నేపథ్యంలో ఆమె సైతం తన ఓటు తనకు కాకుండా.. ఇతరులకు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.మరోవైపు రాష్ట్రంలో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు దాదాపుగా అందరు తమ నియోజకవర్గాల్లో తమ విజయం కోసం ఓటు వేసుకుంటున్నారు. కానీ ఈ ముగ్గురు అభ్యర్థులు మాత్రం తమ గెలుపునకు తామే ఓటు వేసుకోనే పరిస్థితి లేకపోవడం సర్వత్ర చర్చనీయాంశంగా మారింది.

 

 

 

Related News

Select the Topic
Scroll to Top