రంగారెడ్డి నవంబర్ 17 (ఈతరం ఇండియా న్యూస్);తల్లిదండ్రులు లేని ఒక ఆడ బిడ్డ పెళ్లికి తగిన ఆర్ధిక సహాయం చేసి బాసటగా నిలిచింది.హైదరాబాద్ బడంగపేట్ చింతలకుంట నివాసి పగుడోజు భాగ్యలక్ష్మి(22) తల్లిదండ్రులు సుగుణమ్మ మరియు వెంకటాచార్యులు అనారోగ్య కారణాలతో ఆమె చిన్నతనం లోనే శివేైక్యం చెందారు. ఈమెకు మతిస్థిమితం లేని అన్న మరియు చెల్లి ఉన్నారు. వీరందరూ వృద్దాప్యం లో ఉన్న వారి అమ్మమ్మ దగ్గరే పెరుగుతున్నారు. కుటుంబ పోషణకు భాగ్యలక్ష్మి స్థానిక గాజుల షాపులో పని చేస్తున్నది.ఈ నెల 9వ తారీఖున భాగ్యలక్ష్మి వివాహం జరిగింది. ఎటువంటి ఆధారం లేని చి. భాగ్యలక్ష్మి పెళ్లి ఖర్చులకు ₹50,000/- ల ఆర్థిక సహాయం చేయమని స్థానిక నాయకుల ద్వారా వెస్సో ను కోరింది. వెస్సో గౌరవ దాతల సహకారంతో స్థానిక నాయకులు కోటేశ్వరా చారి ద్వారా వధువుకు ₹47,100/-లు అందజేసింది. ఈ సందర్భంగా ‘వెస్సో’ అధ్యక్షులు బంగారు తాతారావు మాట్లాడుతూ తల్లిదండ్రులు లేని ఒక ఆడ బిడ్డ పెళ్లికి తగిన ఆర్ధిక సహాయం చేసి, ఆశీర్వదించిన గౌరవ దాతలందరకూ పేరు పేరునా ధన్యవాదములు తెలిపారు.
















