EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

తుక్కుగూడ సభ ఈసారి కాంగ్రెస్ పార్టీని తుక్కు తుక్కు ఓడగొడ్తది        భారత ప్రజలు వివిధ రాకాల భావోధ్వేగంతో ఎన్నికల తీర్పు కేసీఆర్ కు బుద్ధి చెప్పాలనే భావోద్వేగంతో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించారు  కాంగ్రెస్ గ్యారెంటీ అంటే… అవినీతికి, కుంభకోణాలకు, కుటుంబ పాలనకు, బుజ్జగింపు రాజకీయాలకు గ్యారెంటీ బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్

హైదరాబాద్ ఏప్రిల్ 4 (ఈతరం భారతం న్యూస్ );కాంగ్రెస్ గ్యారెంటీ అంటే… అవినీతికి, కుంభకోణాలకు, కుటుంబ పాలనకు, బుజ్జగింపు రాజకీయాలకు గ్యారెంటీ అని… ఇక తుక్కుగూడ సభతో ఆ పార్టీ ప్రజలకు ఇచ్చే గ్యారెంటీ ఏముంటుందని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ కు బుద్ధి చెప్పాలని భావించి ప్రజలు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించారు తప్పితే… హస్తం పార్టీపై అభిమానంతో కాదన్నారు. దేశంలో ప్రతి ఎన్నికల్లో ప్రజలు ఏదో ఒక భావోద్వేగంతో ఓటు వేశారని… ఈసారి మోదీని మరోసారి గెలిపించాలన్న భావోద్వేగంతో ఓటు వేస్తారన్నారు. మోదీ ప్రభుత్వ సానుకూల ఓటుతో ఈసారి బిజెపి 400కు పైగా స్థానాల్లో గెలుపొందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇవాళ బిజెపి రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై విమర్శలు గుప్పించారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు అనేక ఎన్నికల్లో భారత ప్రజలు వివిధ రాకాల భావోధ్వేగంతో తీర్పునిచ్చారు. ప్రతి సందర్భాన్ని పరిశీలిస్తే ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా తీర్పునిచ్చారు.ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ హత్య తర్వాత మరో విధంగా దేశ వ్యాప్తంగా తీర్పునిచ్చారు.ఎమర్జెన్సీ వ్యతిరేక సమయంలో జనతా పార్టీ ఆవిర్భవించడం, ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో జనతా పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. సమర్థ నాయకుడు, సుస్థిర ప్రభుత్వం పట్ల సానుకూల దృక్ఫథంతో ప్రజలు ఇచ్చిన తీర్పుతో అటల్ బిహారీ వాజ్ పేయి గారు ప్రధాని అయ్యారు.ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అవినీతి, కుటుంబపాలన, కుంభకోణాల కాంగ్రెస్ ను అంతం చేసేందుకు ప్రజలు ఇచ్చిన తీర్పుతో నరేంద్ర మోదీ ప్రధాని అయ్యారన్నారు.నరేంద్ర మోదీ గారు ప్రధాని అయిన రెండో పర్యాయంలో కూడా దేశంలో అనేక రంగాల్లో మార్పు రావాలనే సదాభిప్రాయంతో, ఏకాభిప్రాయంతో బీజేపీ కి సొంత మెజారిటీ లభించింది. అదేవిధంగా, 2024 పార్లమెంటు ఎన్నికల్లోనూ పాజిటివ్ మ్యాండేట్ ఇవ్వబోతున్నారన్నారు..ఇప్పటికే దేశ వ్యాప్తంగా అనేక సర్వేల్లో బీజేపీ కి 370 సీట్లు దాటుతుందని, మిత్రపక్షాలతో కలిసి 400 సీట్లు దాటబోతుందని స్పష్టంగా తెలియజేశాయి.ప్రధాని నరేంద్రమోదీ గారు భారతదేశంలోని అన్ని వర్గాల వ్యక్తిగా, ప్రపంచంలోనే దార్శినిక వ్యక్తిగా, అగ్రరాజ్యాలను శాసించే స్థాయికి ఎదిగిన వ్యక్తిగా ప్రజలు భావించి ఒక పాజిటివ్ మ్యాండేట్ ని 18వ లోక్ సభ ఎన్నికల్లో తీర్పు ఇవ్వబోతున్నారు.మోదీ ని అడ్డుకోవాలని కొన్ని సంస్థలు, వ్యక్తులు ఒకటై కూటమిగా ఏర్పడి పన్నుతున్న నాటకాలు, కుట్రలు, కుతంత్రాలను ప్రజలు అర్థం చేసుకుంటున్నారు.ఫిర్ ఏక్ బార్ నరేంద్రమోదీ సర్కార్ అనే నినాదంతో ప్రజలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.భారతీయ సాంస్కృతిక వైభవాన్ని కాపాడిన మోదీకే మరోసారి ప్రజలు పట్టం కట్టబోతున్నారు.పాలనలో మచ్చలేని నాయకుడు, అవినీతిరహిత ప్రభుత్వంగా పాలన అందించిన మోదీనే ప్రజలు మరోసారి ఎన్నుకోబోతున్నారన్న ధీమా వ్యక్తం చేసారు..భారతదేశంలో ఒకే చట్టం, ఒకే రాజ్యాంగం ఉండాలనే అభిప్రాయంతో ఆర్టికల్ 370రద్దు చేసిన తర్వాత కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రతీ భారతీయ పౌరుడు మోదీ గారికి బాసటగా నిలుస్తున్నారు.మోదీ నే గ్యారెంటీ అనే నినాదాన్ని విధానంగా తీసుకుని ప్రజల్లోకి వెళ్తున్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమేనన్నారు..నడుస్తున్న చరిత్ర, కనబడుతున్న దృశ్యాన్ని ప్రజలు వైనంగా తీసుకుంటున్నారు.అమూల్ బేబీ గా పిలవబడుతున్న వ్యక్తి, లోక్ సభలో అనేక చర్చల్లో చిలిపి వేశాలు వేసిన వ్యక్తి హైదరాబాద్ కి వస్తున్నాడట. ఆయన గ్యారెంటీ ఇవ్వడానికి తుక్కుగూడ బహిరంగ సభకు రాబోతున్నాడట.తుక్కుగూడ సభ ఈసారి కాంగ్రెస్ పార్టీని తుక్కు తుక్కు ఓడగొడ్తది.గతంలో కేసీఆర్ ని ఓడించడానికి కూడా మూడ్ ఆఫ్ ది పబ్లిక్ తో ప్రజలు ఓట్లు వేశారు.భారతదేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా మోదీ గారిని మరోసారి ప్రధానమంత్రి చేయాలనే లక్ష్యంగా వేసే ఓట్లతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కొట్టుకుపోతది, కనుమరుగైతది.రాహుల్ గాంధీ ఎవరికి గ్యారెంటీ, దేనికి గ్యారెంటీ..??స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కుటుంబ పాలన, అవినీతి కుంభకోణాలకు కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ.అవకాశవాద రాజకీయాలకు, బుజ్జగింపు చర్యలకు గ్యారెంటే కాంగ్రెస్.కొత్తగా గ్యారెంటీలు ఇస్తామంటే నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరన్నారు..దేశ సమైక్యత, సమగ్రతలకు భంగం కలిగిస్తున్న దేశ వ్యతిరేక శక్తులకు, వ్యక్తులకు వారసత్వం కాంగ్రెస్ పార్టీ.బెయిల్ మీద బయట తిరుగుతున్న వ్యక్తులా ప్రజానీకానికి గ్యారెంటీ ఇచ్చేది..?జైలుకు వెళ్లిన కాంగ్రెస్ కూటమి వ్యక్తులా ప్రజలకు గ్యారెంటీ ఇచ్చేది..?తుక్కుగూడ సమావేశం కాంగ్రెస్ పార్టీని తుక్కుతుక్కు గా ఓడగొడ్తది. దేశంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగవడం ఖాయం.దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సంక్షేమం దిశగా నడిచిన ఏకైన ప్రభుత్వం నరేంద్రమోదీ ప్రభుత్వం.కరోనా సమయంలో ప్రజలకు ఉచిత వ్యాక్లిన్లు ఇచ్చింది మోదీ ప్రభుత్వమే నబ్న్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రజలకు ఉచితంగా రేషన్ అందిస్తున్నది మోదీ ప్రభుత్వమే.మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది.వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు పాజిటివ్ మ్యాండేట్ ఇవ్వబోతున్నారు. అన్ని కూటములు కొట్టుకుపోవడం ఖాయమని ఎన్ వి ఎస్ ఎస్ ప్రబాకర్ పేర్కొన్నారు.

 

Related News

Select the Topic
Scroll to Top