EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

తుమ్మల యుగంధర్ జన్మదినం సందర్భంగా అనాధ ఆశ్రమంలో పాలు, పండ్లు, అన్నదాన కార్యక్రమాలు..

4.2.2024ఖమ్మం బ్యూరోనలుబోల మధులత (ఈ బీ న్యూస్/ఖమ్మం నగరంలోని 30వ డివిజన్ కు చెందిన కాంగ్రెస్ నాయకులు అర్వపల్లి శివకుమార్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథి డిసిసిబి డైరెక్టర్ మేకల మళ్లీ బాబు యాదవ్ చేతుల మీదుగా తుమ్మల యుగంధర్ జన్మదినం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కరుణగిరి జ్యోతి నివాస్ ప్రాంగణంలోని అనాధ పిల్లలు వికలాంగులు , మూగవారు సమక్షంలో కేక్ కట్ చేసి, మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ యువజన నాయకుడు, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు, ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాత తుమ్మల నాగేశ్వరరావు గారి తనయుడు తుమ్మల యుగంధర్ తండ్రికి తగ్గతనయుడుగా, యంగ్ డైనమిక్ లీడర్ గా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, వారి జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. తుమ్మల అనే పదం ఖమ్మం జిల్లాకు ఒక బ్రాండ్ అని మల్లి బాబు యాదవ్ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో చల్లా శ్రీను, కీత శ్రీనివాస్, పోనేబోయిన సాయి, ధారావత్ శివకుమార్, భూక్యా నాగేంద్రబాబు,మేకల మహేష్, గుగులోతు రవి, మల్లికార్జున్ కమలా వేణు, గౌతమ్, పత్తిపాక వంశీ, అరుణ్ తదితరులు పాల్గొన్నారు

Related News

Select the Topic
Scroll to Top