EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

తెనాలిలో ఓటరుపై చేయిచేసుకున్న ఎంఎల్ఏ అన్నాబత్తుని శివ‌కుమార్‌      ఈసీ ఆగ్ర‌హం.. అదుపులోకి తీసుకోవాల‌ని ఆదేశం

తెనాలి మే 13 (ఈతరం భారతం న్యూ స్); : ఓ పోలింగ్ బూత్ లోకి ఎంఎల్ఏ అన్నాబత్తుని శివ కుమార్ వెళుతుండగా, క్యూ లైన్ లో నిలుచున్న గొట్టి ముక్కల సుధాకర్ అనే వ్యక్తి అభ్యంతరం చెప్పాడు. లోపలికి వెళ్లొద్దని అన్నాడు. దాంతో ఎంఎల్ఏ రెచ్చిపోయి అతడి చెంప చెళ్లుమనిపించాడు. దానికి ఆ ఓటరు కూడా తీవ్రంగానే స్పందించాడు. బాధిత ఓట‌రు కూడా ఎమ్మెల్యేను కొట్టాడు. దీంతో ఎమ్మెల్యే అనుచ‌రులు ఓట‌రుపై దాడి చేసి తీవ్రంగా గాయ‌ప‌రిచారు.కాగా ఓటరుపై చేయి చేసుకున్న ఎంఎల్ఏ పై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ఈసి ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ పూర్తయ్యే వరకు ఎంఎల్ఏ అన్నాబత్తుని శివ కుమార్ ను గృహ నిర్బంధంలో ఉంచాలని ఆదేశంలో పేర్కొంది

 

 

 

 

Related News

Select the Topic
Scroll to Top