EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ

తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ

హైదరాబాద్ సెప్టెంబర్ 3 (ఈతరం భారతం);: తెలంగాణలోని పలు జిల్లాల్లో మంగళవారం, బుధవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మంగళవారం కొమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట్, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం జిల్లాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని ఐఎండి ప్రకటించింది. ఇక బుధవారం కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడే అవకాశం ఉందని తెలిపింది.మధ్య విదర్భ ప్రాంతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం ప్రస్తుతం బలహీనపడి పశ్చిమ విదర్భ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంది. దీనికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 31 కిమీ. ఎత్తు వరకు ఆవరించి ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తాంధ్ర, యానం పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టం నుంచి 3.1 మొదలుకుని 5.8 కిమీ. మేరకు ఉపరితల ఆవర్తనం రూపొందిందని ఐఎండి పేర్కొంది.

Related News

Select the Topic
Scroll to Top