EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

తెలంగాణలో సామాజిక న్యాయం ఏది రాహుల్ జీ .! బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేశ్ , అధ్యక్షులు

హైదరాబాద్ ఏప్రిల్ 8 (ఈతరం భారతం న్యూస్);దేశ మహిళలను రైతులను యువతను కార్మికులను ఆర్థికంగా ప్రోత్సహించడానికి కాంగ్రెస్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో ఈ వర్గాలకు పెద్దపీట వేయడాన్ని సంపూర్ణంగా స్వాగతిస్తున్నామని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేష్ తెలిపారు. ఇదే తరుణంలో రాష్ట్రంలో బీసీలకు కొనసాగుతున్న సామాజిక రాజకీయ అన్యాయాన్ని ట్విట్టర్ వేదికగా దాసు సురేష్ ఉటంకించారు..77 ఏళ్ల స్వతంత్ర భారత దేశంలో నేటికి న్యాయ,మీడియా వ్యవస్థ,వ్యాపార పారిశ్రామిక రంగాలలో 50% పైనున్న బీసీలు కనీసం 10% వాటానైనా అందుకోలేక పోవడానికి కారణం ఎవరని ప్రశ్నించారు..కులగణన ద్వారా దేశపు ఎక్సురే అవసరమేననీ అయితే తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే ద్వారా ఈ ప్రక్రియ ఇక్కడ పూర్తయినప్పటికీ అందుకు తదనుగుణంగా రేవంత్ సర్కారు నిర్ణయాలు చేపట్టకుండా బీసీ ఎస్సీ అదివాసీ మైనార్టీ వర్గాలను విస్మరించడం దేనికి నిదర్శనమన్నారు.ఉదయపూర్ డిక్లరేషన్ లో పేర్కొన్న విధంగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గం లో రెండు అసెంబ్లీ సీట్లను బీసీలకు కేటాయిస్తామన్న కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదన తెలంగాణలో ఎందుకు అమలుకు నోచుకోలేదో తెలపాలన్నారు . కాంగ్రెస్ పార్టీలో బీసీల నాయకత్వం కరువైనట్టుగా ఇతర పార్టీ నాయకులను అరువు తెచ్చుకొని వారికి పార్లమెంటు ఎన్నికలలో సీట్లు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీలోని బీసీలను అవమానించడమే అన్నారు.ఇతర ప్రధాన పార్టీలు కనీసం ఐదారు స్థానాలు బీసీలకు కేటాయిస్తుండగా కాంగ్రెస్ మాత్రం 3 టికెట్లకే బీసీలను పరిమితం చేయడం బీసీలను అవమానించడమేనన్నారు..తెలంగాణ ఏర్పాటు కోసం తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకొని అందుకు తదనుగుణంగా రాష్ట్రాన్ని ప్రసాదించిన కాంగ్రెస్ పార్టీకి, సోనియాగాంధీకి తెలంగాణ ప్రాంతపు ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారని తెలియజేశారు అయితే కాలేశ్వరం ప్రాజెక్టులో అగ్రవర్ణాలకు చెందిన అవినీతి తిమింగలాలను వదిలేసి టాస్క్ ఫోర్సు ఏసీబీ పేరుతో పేద బలహీన వర్గాలకు చెందిన ఉద్యోగులపై చర్యలకు ఒడిగట్టడం, వారిని అరెస్టు చేయడం ఏ విధంగా సహేతుకమని ప్రశ్నించారు.. ముఖ్యమంత్రి కార్యాలయం మొత్తం అగ్రవర్ణాలతో నిండి కేవలం ఒకే ఒక్క బీసీ ఎస్సీ అధికారికి మాత్రమే అవకాశం ఇచ్చిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు.. ముఖ్యమైన కార్పొరేషన్ పదవులన్నీ అగ్రవర్ణాలకు కేటాయిస్తున్న రేవంత్ సర్కార్ తెలంగాణలో సామాజిక న్యాయాన్ని ఎలా అమలు చేస్తుందో తెలుపాలన్నారు.. ఈ అంశాలపై సంపూర్ణ వివరణ ఇచ్చిన తర్వాతనే తెలంగాణలో కాంగ్రెస్ బీసీల ఓట్లు అభ్యర్థించాలని డిమాండ్ చేసారు..

 

Related News

Select the Topic
Scroll to Top