EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

తెలంగాణ అప్పులు రూ.6,71,757 కోట్లు ప్రకటించిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సమయానికి అప్పులు రూ.72,658 కోట్లు రోజువారీ ఖర్చులకు కూడా అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి పదేళ్లలో రాష్ట్రం దివాలా తీసింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సభలో శ్వేత పత్రం విడుదల చేసిన డిప్యూటీ సీఎం భట్టి

 

హైదరాబాద్ డిసెంబర్ 20 (ఈతరం న్యూ స్);: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శ్వేత పత్రం విడుదల చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సభలో భట్టి శ్వేత పత్రం విడుదల చేశారు. రోజువారీ ఖర్చులకు కూడా అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. పదేళ్లలో రాష్ట్రం దివాలా తీసిందన్నారు. ఆర్థిక అరాచకత్వాన్ని ప్రజలకు చెప్పాల్సిన భాధ్యత తమపై ఉందన్నారు. కాగా అంతకు ముందు ఏఐఎంఎం పార్టీ ఫ్లోర్ లీడర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ ఎన్నికయ్యారు. సీపీఐ ఫ్లోర్ లీడర్‌గా కూనంనేని సాంబశివరావులు ఎంపిక అయినట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు.తెలంగాణ అప్పులు రూ.6,71,757 కోట్లు అని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై విడుదల చేసిన శ్వేతపత్రంలో ఈ మేరకు పేర్కొంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సమయానికి అప్పులు రూ.72,658 కోట్లుగా ఉండగా పదేళ్లలో సంవత్సరానికి 24.5 శాతం చొప్పు పెరిగినట్టు పేర్కొంది. ఆదాయం రాబడిలో రుణాల చెల్లింపులు 34 శాతం, ఉద్యోగుల జీవితాలు, పెన్షన్లకు 35 శాతం కేటాయించినట్టని పేర్కొంది.కాగా.. నేడు సభ ప్రారంభమవగానే స్పీకర్ గడ్డం ప్రసాద్ సంతాప తీర్మానాలను పెట్టారు. మెదక్ జిల్లా పూర్వ రామాయంపేట మాజీ ఎమ్మెల్యే రామన్నగారి శ్రీనివాస్ రెడ్డి మృతిపట్ల సభ సంతాపం.. ఆయన కుటుంబానికి శాసనసభ ప్రగాఢ సానుభూతి తెలిపింది. పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరిశ్వర్ రెడ్డి.. భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి మృతి పట్ల సభ సంతాపాన్ని తెలిపింది. ఈ ముగ్గురు మాజీ శాసన సభ్యులకు సంతాపంగా సభ 2 నిమిషాలు మౌనం పాటించింది.

Related News

Select the Topic
Scroll to Top