తెలంగాణ టీపీసీసీ అధ్యక్షులుగా మహేష్ కుమార్ గౌడ్
ఈతరం భారతం హైదరాబాద్ ప్రతినిధి 6.9.24
తెలంగాణ 4వ టీపీసీసీ అధ్యక్షులుగా మహేష్ కుమార్ గౌడ్ నియమితులయినారు. మహేష్ కుమార్ గౌడ్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు.టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్గనైజేషన్ గా పని చేసారు.కాంగ్రేస్ పార్టీ లోఎన్ఎస్ యుఐ అధ్యక్షుడిగా, వివిద హోదా లలో పనిచేస్తూ, పి సి సి, వర్కింగ్ ప్రెసిడెంట్, ఆర్గనైజేషన్ ఇంచార్జీ గా విశిష్ట సేవలను అందించిన మహేష్ కుమార్ గౌడ్ ను రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడుగా నియమించింది. వెనుకబడిన వర్గాలకు చెందిన మహేష్ కుమార్ గౌడ్ ను పి సి సి అధ్యక్షుడుగా నియమించడం, కాంగ్రెస్ పార్టీ కి బిసి ల పట్ల ఉన్న నిబద్ధత కు నిదర్శనం.















