EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

తెలంగాణ బీజేపీ శాసనసభ పక్షనేతగా ఏలేటి మహేశ్వర రెడ్డి?

హైదరాబాద్ ఫిబ్రవరి 8 (ఈ బీ న్యూస్ );: తెలంగాణ బీజేపీ శాసనసభ పక్షనేతగా ఏలేటి మహేశ్వర రెడ్డిని నియమించే అవకాశం ఉంది. ఈ మేరకు బీజేపీ అగ్రనాయకత్వం నేడు అధికారికంగా ప్రకటించనుందని సమాచారం. ప్రస్తుతం నిర్మల్ ఎమ్మెల్యేగా ఉన్న ఏలేటి మహేశ్వర రెడ్డి.. 2009లో ప్రజారాజ్యం పార్టీలో ఎమ్మెల్యేగా పనిచేశారు. కాగా అసెంబ్లీ బీఏసీ సమావేశానికి 8 మంది బీజేపీ ఎమ్మెల్యేల్లో ఒకరిని పిలవాలని ఆ పార్టీ శాసనసభ్యులుస్పీకర్‌ను కోరారు. ఈ క్రమంలో నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డిని పిలవాలని బీజేపీ ఎమ్మెల్యేలంతా సంతకాలు చేసిన లేఖను స్పీకర్‌కు అందించారు. దీంతో బీజేపీ నుంచి ఏలేటి మహేశ్వరరెడ్డి బీఏసీ సమావేశానికి హాజరయ్యారు. దీనిని బట్టి బీజేపీ శాసనసభా పక్షనేతగా ఏలేటి మహేశ్వరరెడ్డి పేరు ఖరారు అయినట్టేనని పలువురు చెబుతున్నారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top