EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

తెలంగాణ భవన్‌ కు ఆటోలో వెల్లిన కేటిఅర్

హైదరాబాద్ జనవరి 27 (ఈ బీ న్యూ స్); బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు ఆటోలో ప్రయాణించారు. యూసుఫ్‌గూడ్‌ నుంచి జూబ్లీహిల్స్‌లో తెలంగాణ భవన్‌ వరకు ఆయన ఆటోలో వెళ్లారు. పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా విస్తృతస్థాయి కార్యక్తల సమావేశం నిర్వహించాలని బీఆర్‌ఎస్‌ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్‌ నియోజకర్గ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం యూసుఫ్‌గూడ్‌లో పాల్గొని కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. సమావేశం అనంతరం కారులో కాకుండా ఆటోలో బయలుదేరి తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. భద్రతా సిబ్బంది సైతం ఆయనను ఆటోలోనే అనుకరించారు

.

 

Related News

Select the Topic
Scroll to Top