EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

తెలంగాణ రాష్ట్ర సచివాలయం నూతన మహిళా సంఘం, కార్యవర్గం ఏర్పాటు

హైదరాబాద్ ఫిబ్రవరి 20 (ఈ బీ న్యూ స్);:తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు ముందు సచివాలయం లో ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ విమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ పనిచేస్తూ ఉండేది. తెలంగాణ సచివాలయం లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల సర్వసభ్య సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ విమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ కు డా. బి. ఆర్ అంబేద్కర్ తెలంగాణ విమెన్ అసోసియేషన్ గా పేరును మారుస్తూ ఏకగ్రీవంగా నిర్ణయించడం జరిగింది. సర్వసభ్య సమావేశం లో, పది సంవత్సరాల తర్వాత పునరుద్దరించబడిన మహిళా సంఘానికి తాత్కాలిక కార్యవర్గాన్ని నియమించడం జరిగినది. పద్మ, అధ్యక్షురాలు, కె. గీత, ప్రధాన కార్యదర్శి, పద్మావతి మరియు లలిత సహధ్యక్షులు, కె . రమాదేవి ఆర్గనైసింగ్ సెక్రటరీ, జి. లావణ్య లత, కోశాధికారి తదితరులు కార్యవర్గము లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మహిళా సంఘాన్ని ఏర్పాటు చేయడం పట్ల సచివాలయం లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు వారి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారిసమస్యల పరిష్కారానికి నూతన కార్యవర్గం కృషిచేస్తుందని ఆశభావాన్నీ వ్యక్తం చేసారు

.

 

Related News

Select the Topic
Scroll to Top